Begin typing your search above and press return to search.

జూన్‌ 25 నుంచి ఎన్టీఆర్‌ షూటింగ్‌

By:  Tupaki Desk   |   12 Jun 2015 10:53 AM IST
జూన్‌ 25 నుంచి ఎన్టీఆర్‌ షూటింగ్‌
X
ఎన్టీఆర్‌ టెంపర్‌ రిలీజై చాలా కాలమే అయ్యింది. దయాగాడి దండయాత్ర బాక్సాఫీస్‌ని ఓ ఊపు ఊపింది. అయితే అంత పెద్ద విజయం అందుకున్న తర్వాత కూడా ఎన్టీఆర్‌ తదుపరి సినిమా సెట్స్‌కెళ్లేదెప్పుడు అన్నదాంట్లో క్లారిటీ రాలేదు ఇంతకాలం. దర్శకుడు సుకుమార్‌ స్వయంగా 'నాన్నకు ప్రేమతో' అంటూ టైటిల్‌ ప్రకటించేశాడు.

ఆ తర్వాత కూడా 'ఇదిగో పులి అంటే అదిగో మేక' అన్న చందంగా సెట్స్‌కెళ్లే విషయంలో క్లారిటీనివ్వలేకపోయారు. ఎట్టకేలకు దానిక్కూడా స్పష్టత వచ్చేసింది. జూన్‌ 25నుంచి చిత్రయూనిట్‌ ఆన్‌సెట్స్‌ బిజీ అయిపోతోంది. లండన్‌లో ఈనెల 25 నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభించి 45రోజుల పాటు నాన్‌స్టాప్‌ షూటింగ్‌ చేస్తారు. ప్రస్తుతం దేవీశ్రీ ప్రసాద్‌ బాణీల కోసం కసరత్తు చేస్తున్నాడు. ఎన్టీఆర్‌ ఎనర్జీ లెవల్‌కి తగ్గట్టు పెప్పీ సాంగ్స్‌ కోసం భారీ కసరత్తులు చేస్తున్నాడు.

అత్తారింటికి దారేది ఫేం బివిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్‌ సరసన రకూల్‌ ప్రీత్‌ కథానాయికగా ఆడిపాడుతోంది. లెజెండ్‌, లింగా వంటి భారీ చిత్రాల తర్వాత జగపతిబాబు ఈ చిత్రంలో మరో ఆసక్తికర పాత్రను చేస్తున్నాడు. తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో ఎన్టీఆర్‌ ఏమేరకు క్యాష్‌ చేసుకుంటాడో చూడాలి.