Begin typing your search above and press return to search.

తదుపరి సినిమాల కోసం ఎన్టీఆర్ పక్కా ప్రణాళిక!!

By:  Tupaki Desk   |   21 July 2020 11:50 AM GMT
తదుపరి సినిమాల కోసం ఎన్టీఆర్ పక్కా ప్రణాళిక!!
X
యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక సినిమా 'ఆర్ఆర్ఆర్'లో నటిస్తున్నాడు. ఇక ఎన్టీఆర్ ఈ సినిమాలో కొమరం భీంగా కనిపించనున్నాడన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీ ఉంటూనే తదుపరి సినిమాల దర్శకులను సన్నద్ధం కావాలని సూచిస్తున్నాడట. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా తరవాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో మరో సినిమా చేయనున్నాడు. వీరి కాంబినేషన్లో రానున్న సినిమా పై ఇప్పటికే అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. అధికారికంగా సినిమా ప్రకటించిన చిత్రయూనిట్ 'అయినను పోయిరావలె హస్తినకు' అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తుంది. ఇక త్రివిక్రమ్ తో సినిమా తర్వాత మరో భారీ ప్రాజెక్ట్ కూడా పట్టాలు ఎక్కనుంది.

కేజీఎఫ్ సినిమాతో అన్ని ఇండస్ట్రీలలో సంచలనం సృష్టించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ సినిమా చేయనున్నాడు. అయితే కరోనా కారణంగా ఎన్టీఆర్ అనుకున్న ప్రణాళికలన్నీ వృధా అయిపోవడంతో ప్రస్తుతం తదుపరి సినిమా డైరెక్టర్ త్రివిక్రమ్ తో ఇటీవలే మాట్లాడాడట. ఎలాగైనా సినిమా వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలనీ సూచించాడట. అందుకు తగ్గట్లే షూటింగ్.. ప్రొడక్షన్ షెడ్యూల్స్ ప్లాన్ చేసి ఉంచాలని చెప్పినట్లు సమాచారం. దీనికి త్రివిక్రమ్ కూడా సై అన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ షూటింగ్ కోసం ఇంకా చాలా డేట్స్ కేటాయించాల్సిన అవసరం ఉందట. ఒకవేళ అది ఆలస్యం అయితే మిగతా సినిమాలు కూడా ఆలస్యం అవడం ఖాయం. అందుకని ముందే జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ ప్లాన్ చేస్తున్నాడట. ఎందుకంటే ఎన్టీఆర్ తదుపరి సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయిలోనే రూపొందనున్నాయట. చూడాలి మరి త్రివిక్రమ్ మూవీ అనుకున్న టైంకి ఫినిష్ చేస్తారేమో..!