Begin typing your search above and press return to search.

EMK : ఎన్టీఆర్ స్టార్‌ డం వర్కౌట్ అయ్యింది

By:  Tupaki Desk   |   9 Sep 2021 7:47 AM GMT
EMK : ఎన్టీఆర్ స్టార్‌ డం వర్కౌట్ అయ్యింది
X
స్టార్‌ హీరోలు బుల్లి తెరపై చేస్తున్న సందడికి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇప్పటికే నాగార్జున వరుసగా బిగ్‌ బాస్‌ తో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తుండగా తాజాగా ఎన్టీఆర్ జెమిని టీవీ ద్వారా ఎవరు మీలో కోటీశ్వరులు షో తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మీలో ఎవరు కోటీశ్వరులు అంటూ స్టార్‌ మాలో గతంలో నాగార్జున మరియు చిరంజీవిలు చేసిన విషయం తెల్సిందే. ఆ షో లు ఆశించిన స్థాయిలో రేటింగ్ లను దక్కించుకోలేక పోయాయి. దాంతో స్టార్‌ మా ఆ షోను నిలిపి వేసింది. ఇప్పుడు అదే కాన్సెప్ట్‌ తో జెమిని టీవీ వారు ఎన్టీఆర్ స్టార్ డం పై నమ్మకంతో భారీగా ఖర్చు చేసి మొదలు పెట్టిన షో ఎవరు మీలో కోటీశ్వరులు. షో కాస్త మార్చి జెమిని వారు టెలికాస్ట్‌ చేస్తున్నారు. ఎన్టీఆర్‌ స్టార్ డమ్‌ తో ఖచ్చితంగా ప్రేక్షకులు టీవీలకు అతుక్కు పోవడం ఖాయం అంటూ అంతా నమ్మకం వ్యక్తం చేశారు. అనుకున్నదే అయ్యింది. షో కు మంచి రెస్పాన్స్‌ వస్తోంది.

మొదటి రెండు రోజుల ఎపిసోడ్స్‌ కు మంచి రేటింగ్ వచ్చింది. అది ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ లు కలిసి చేయడం వల్ల ఆ రేటింగ్‌ వచ్చింది కాని ఆ తర్వాత ఎపిసోడ్స్ కు అంతగా రేటింగ్స్ రాకపోవచ్చు అనే టాక్‌ వచ్చింది. కాని ఆ తర్వాత ఎపిసోడ్స్‌ కు కూడా ఎన్టీఆర్‌ స్టార్‌ డమ్‌ కారణంగా మంచి రేటింగ్‌ వచ్చినట్లుగా తాజా సమాచారం. బుల్లి తెర వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం షో రెండవ వారం యావరేజ్‌ రేటింగ్‌ 6.48 గా నమోదు అయినట్లుగా తెలుస్తోంది. ఇది ఖచ్చితంగా బెస్ట్‌ రేటింగ్‌ అంటూ నిర్వాహకులతో పాటు విశ్లేషకులు అంటున్నారు.

ఎన్టీఆర్ గతంలో బిగ్ బాస్ షో కు హోస్టింగ్‌ చేశాడు. ఆ షో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. బుల్లి తెరపై తన కు తిరుగు లేదు అంటూ మరో సారి ఎన్టీఆర్‌ నిరూపించాడు అంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు ప్రేక్షకులకు కౌన్ బనేగా కరోడ్‌ పతి షో ను దగ్గర చేసేందుకు ప్రయత్నిస్తున్న ఎన్టీఆర్‌ ప్రయత్నం ఫలిస్తుందని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి కౌన్‌ బనేగా కరోడ్‌ పతి తెలుగు వర్షన్ కు ఎన్టీఆర్‌ స్టార్‌ డమ్ కారణంగా సక్సెస్ దక్కిందని చెప్పుకోవచ్చు. ముందు ముందు సీజన్ లకు కూడా ఆయనే హోస్ట్‌ గా రావాలని ఆశిస్తూ అభిమానులు షో ను మరింత సక్సెస్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.