Begin typing your search above and press return to search.
ఈ కాంబినేషన్ ఆ పైవాడు సెట్ చేసిందే: ఎన్టీఆర్
By: Tupaki Desk | 20 Dec 2021 1:10 PM ISTరాజమౌళి అంటే సక్సెస్ కి మారుపేరు .. పట్టుదలకు ప్రతీక. తన తాజా చిత్రం ఇంతకుముందు సినిమాల మాదిరిగానే హిట్ అయితే చాలు అనుకునే రకం కాదు ఆయన. అలాగే పెట్టిన డబ్బులు వస్తే చాలు అనుకునే రాజీపడే మనస్తత్వం కూడా ఆయనకి లేదు. సినిమాకి .. సినిమాకి ఎదగాలి. ప్రతి విషయంలోనూ .. ప్రతి అంశంలోను ఆ సినిమా ఇంతకుముందు తాను చేసిన సినిమాల కంటే బాగుండాలి. గత చిత్రాలకంటే అది ఒక రూపాయి ఎక్కువే వసూలు చేయాలి అనే ఒక కసితోనే ఆయన కసరత్తు జరుగుతుంది.
పని అందరూ చేస్తారు .. తపస్సు కొందరే చేస్తారు . తపస్సు చేసినవారికి మాత్రమే వరాలను పొందే అర్హత ఉంటుంది .. అలాంటి అర్హతను పొందడానికి అనుక్షణం ఆరాటపడే దర్శకుడిగా రాజమౌళి కనిపిస్తారు. దేశం గర్వించదగిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రాజమౌళి కెరియర్, ఎన్టీఆర్ సినిమా 'స్టూడెంట్ నెంబర్ 1'తోనే మొదలైంది. ఆ తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్లో 'సింహాద్రి' .. 'యమదొంగ' వంటి బ్లాక్ బస్టర్ హిట్లు వచ్చాయి. అందువలన ఈ ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఇక 'మగధీర' సినిమాతో చరణ్ కెరియర్ ను నిలబెట్టిన ఘనత కూడా రాజమౌళి ఖాతాలోనే కనిపిస్తుంది. అప్పటి నుంచి వాళ్లిద్దరి మధ్య స్నేహ భావం ఉంది.
అందువల్లనే ఈ ఇద్దరి హీరోలతో రాజమౌళి 'ఆర్ ఆర్ ఆర్' సినిమాను చేయగలిగాడు. లేదంటే ఈ కాంబినేషన్ ను కలపడం అంత తేలికగా జరిగే పని కాదు. ఎన్టీఆర్ .. చరణ్ ఇద్దరూ కూడా ఈ సినిమా కథ వినేసి ఓకే చెప్పేశారని అనుకోలేం. రాజమౌళి పట్ల వాళ్లకి గల నమ్మకం కారణంగానే ఒప్పుకుని ఉంటారనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.
ఒక కథానాయకుడితో ఒక కథను సెట్ చేసుకోవడం చాలా తేలికనే. కానీ ఇద్దరు సమానమైన స్టార్ లను తీసుకుని వాళ్ల అభిమానులకు సంతృప్తిని కలిగించేలా ఆ పాత్రలను డిజైన్ చేయడం చాలా కష్టమైన విషయం. ఈ విషయంపైనే రాజమౌళి ఎంతో కసరత్తు చేసి ఉండాలి.
ఇక ఇప్పుడు ఈ సినిమా విడుదల తేదీ దగ్గరికి వచ్చేస్తోంది. జనవరి 7వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను పలకరించనుంది. ఈ నేపథ్యంలో నిన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ముంబైలో జరిగింది. ఈ స్టేజ్ పై ఎన్టీఆర్ మాట్లాడుతూ .. "రామ్ చరణ్ అభిమానులందరికీ స్వాగతం. చరణ్ వైపు చూపుతూ .. "బహుశా మా కలయిక ఆ దేవుడు నిర్ణయించినదేనేమో.
రామ్ అంటే తారక్ .. చరణ్ అంటే రామ్ చరణ్. అందుకే నేను .. రామ్ చరణ్ అభిమానులకు అని సంభోదించాను" అన్నాడు. రామ్ చరణ్ పేరులోనే తన పేరు కూడా కలిసి ఉందనే విషయాన్ని స్పష్టం చేస్తూ, తమ మనసులు కూడా అలాగే కలిసిపోయాయనే విషయాన్ని సూచిస్తూ తమ మధ్య గల స్నేహభావాన్ని చాటుకున్నాడు.
ఇద్దరు స్టార్ హీరోలను తెరపై మాత్రమే కాదు .. నిజ జీవితంలోను ప్రాణస్నేహితులుగా మార్చిన క్రెడిట్ కూడా రాజమౌళికే దక్కుతుంది.