Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ కు ఓకే చెప్పేందుకు టైమ్‌ తీసుకుందట

By:  Tupaki Desk   |   3 Sep 2021 8:30 AM GMT
ఎన్టీఆర్ కు ఓకే చెప్పేందుకు టైమ్‌ తీసుకుందట
X
ఎవరు మీలో కోటీశ్వరులు షో లో ఎన్టీఆర్ కంటెస్టెంట్స్ తో ఇంట్రాక్ట్‌ అవుతున్న విధానం కు అంతా కూడా ఫిదా అవుతున్నారు. వయసుకు తగ్గట్లుగా కంటెస్టెంట్స్ తో ఎన్టీఆర్ మాటలు కలుపుతూ ఆకట్టుకుంటున్నాడు. అంతకు ముందు ఎపిసోడ్ లో తన తండ్రితో ఉన్న అనుబంధం గురించి షేర్ చేసిన ఎన్టీఆర్ తాజా ఎపిసోడ్‌ లో తన భార్య లక్ష్మి ప్రణతి గురించిన విషయాలను వెళ్లడించాడు. ఆమె పెళ్లి సమయంలో ఎస్ లేదా నో చెప్పక పోవడంతో చాలా తికమక పడ్డట్లుగా చెప్పుకొచ్చాడు.

పెళ్లి చూపులు సమయంలో లక్ష్మి ప్రణతిని చూసి నేను వెంటనే ఓకే చెప్పేశాను. కాని తాను మాత్రం వెంటనే ఓకే చెప్పలేదు. నేను అడిగినా కూడా సరైన సమాధానం చెప్పలేదు. బలవంతం చేసి ఏమైనా పెళ్లి చేస్తున్నారా అని అడిగాను అంటూ అందరితో నవ్వులు పూయించాడు. ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్లికి 8 నెలల గ్యాప్ వచ్చిందని.. ఆ సమయంలో లక్ష్మి ప్రణతి నుండి ఓకే అనే జవాబు వచ్చిందని ఈ సందర్బంగా ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. ఆడవారి మాటలను అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఆడవారిని అర్థం చేసుకున్న వాడు దేన్నైనా అర్థం చేసుకోవచ్చు అనే విషయం బోధ పడింది అంటూ ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. ఆడవారి మనసు గెలుచుకున్న వాడు దేన్నైనా గెలుచుకుంటాడు అంటూ ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు.

షో లో కంటెస్టెంట్స్ తో మాట్లాడుతూ తన కుటుంబం గురించి తన విషయాలను గురించి చెబుతున్న ఎన్టీఆర్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఇంతకు ముందు పలు ఇంటర్వ్యూల్లో ఈ విషయాలను గురించి ఆయన చెప్పలేదు. మొదటి సారి ఈ విషయాలను ఆయన వెళ్లడిస్తూ ఉన్నాడు. ఎన్టీఆర్‌ సినిమాల విషయానికి వస్తే ఆర్ ఆర్ ఆర్‌ విడుదలకు సిద్దంగా ఉంది. కరోనా వల్ల ఆలస్యం అవుతున్న ఈ సినిమా వచ్చే ఏడాదికి విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ సినిమా విడుదల తో సంబంధం లేకుండా ఎన్టీఆర్‌ తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ వచ్చిన విషయం తెల్సిందే.