Begin typing your search above and press return to search.

మహానటిపై ఎన్టీఆర్ ఏమన్నాడంటే..

By:  Tupaki Desk   |   11 May 2018 10:22 PM IST
మహానటిపై ఎన్టీఆర్ ఏమన్నాడంటే..
X
మహానటి మూవీలో దిగ్గజ ఎన్టీఆర్ పాత్రలో.. జూనియర్ ఎన్టీఆర్ నటించాల్సి ఉంది. దర్శక నిర్మాతలు యంగ్ టైగర్ ను పలుమార్లు అడిగారు కూడా. కానీ తాతగారి పాత్రలో తాను నటించడం అనేది ఎప్పటికీ చేయకూడదని ముందే ఫిక్స్ అయిపోయిన జూనియర్.. ఆ సినిమాలో నటించలేదు కానీ.. ఇప్పుడు ముూవీ చూసి తన స్టైల్ లో రివ్యూ కూడా ఇచ్చేశాడు.

'మహానటి ఒక సినిమా మాత్రమే కాదు.. ఒక అనుభవం. మహానటిగా కీర్తి సురేష్ చూపిన నటన గురించి చెప్పేందుకు మాటలు చాలడం లేదు. బహుశా సావిత్రి గారే ఆమెతో అలా చేయించారేమో. అద్భుతమైన నటీనటులను ఎంచుకుని.. వారితో సూపర్బ్ గా నటింపచేసిన నాగ్ అశ్విన్ కు అభినందనలు' అని ట్వీట్ చేసిన ఎన్టీఆర్.. అంతటితో ఆగలేకపోయాడు. మరో ట్వీట్ ద్వారా మరిన్ని పొగడ్తలు కురిపించాడు.

'ఇలాంటి మూవీని సాకారం చేసినందుకు స్వప్న, ప్రియాంక అండ్ దత్ లకు కృతజ్ఞతలు. దుల్కర్ సల్మాన్.. సమంత రూత్ ప్రభు.. విజయ్ దేవరకొండ అద్భుతంగా నటించారు. ఇతర నటీనటులు.. టెక్నికల్ టీం అద్భుతంగా వర్క్ చేశారు. మిక్కీ జే మేయర్ అందించిన సంగీతం బాగుంది. మహానటి టీంకు అభినందనలు. మీకు దక్కుతున్న అన్ని ప్రశంసలకు.. మొత్తం మీ టీం అంతా అర్హులు' అన్నాడు ఎన్టీఆర్.