Begin typing your search above and press return to search.

మరో షెడ్యూల్ కు ఎన్టీఆర్ రెడీ..

By:  Tupaki Desk   |   15 July 2018 1:35 PM IST
మరో షెడ్యూల్ కు ఎన్టీఆర్ రెడీ..
X
ఎన్టీఆర్ ఇప్పుడు కాస్త ఫ్రీ అయ్యాడు. రెండు నెలల కిందటి వరకూ జూనియర్ చాలా బిజీగా ఉన్నాడు. ఆయన భార్య లక్ష్మీ ప్రణతి గర్భవతిగా ఉండడంతో త్రివిక్రమ్ తో సినిమా షూటింగ్ కు కూడా గ్యాప్ ఇచ్చాడు. ఇక తాను మొదటి సీజన్ లో చేసిన బిగ్ బాస్ లాంటి షోను కూడా వదులుకొని కుటుంబంతో గడిపాడు.. ఎన్టీఆర్ కు కొడుకు పట్టడం.. అతడి నామకరణం కూడా పూర్తికావడంతో కాస్త ఫ్రీ అయ్యాడు. ఈ గ్యాప్ లోనే ఓ మొబైల్ ఔట్ లెట్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా ఎన్టీఆర్ మారాడు.

ఇక ఇప్పుడు అన్ని పనులు పూర్తి కావడంతో తన తాజా సినిమా ‘అరవింద సమేత’ సినిమా షూటింగ్ కు బయలుదేరుతున్నాడు. రేపటినుంచి ఈ సినిమా షెడ్యూల్ మొదలుకాబోతోంది. రామోజీ ఫిలింసిటీలో ప్రారంభం కాబోతున్న ఈ షెడ్యూల్ రెండు వారాల పాటు కొనసాగుతుంది. ఆ తర్వాత యూనిట్ అంతా కలిసి పొల్లాచిలో కూడా 10 రోజుల షెడ్యూల్ లో పాల్గొంటుందని సమాచారం.

ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ - టీజర్ కు మంచి స్పందన వచ్చింది. ఆగస్టు 15న టీజర్ ను విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. అదే రోజున సినిమా విడుదల తేదీని కూడా ప్రస్తాటిస్తారు.. దసరా సెలవులను బేస్ చేసుకొని ఈ సినిమా విడుదల చేయడానికి యూనిట్ సిద్ధమైనట్లు తెలిసింది.

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అరవింద సమేత’ సినిమా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈషారెబ్బ మరో హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.