Begin typing your search above and press return to search.

వచ్చే ఏడాది డిఫరెంట్ లుక్స్ లో అలరించనున్న స్టార్ హీరో

By:  Tupaki Desk   |   8 April 2020 11:30 AM GMT
వచ్చే ఏడాది డిఫరెంట్ లుక్స్ లో అలరించనున్న స్టార్ హీరో
X
ప్రస్తుతం ఇండియన్ సినీ ఫ్యాన్స్ ఆత్రంగా ఎదురుచూస్తున్న సినిమా 'రౌద్రం రుధిరం రణం' అదే ఆర్ ఆర్ ఆర్. దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ - రాంచరణ్ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. స్వాతంత్ర్య పోరాట యోధులు అల్లూరి సీతారామరాజు - కొమరం భీమ్ జీవితగాథలతో ఈ సినిమా రూపొందుతుంది. ఇందులో కొమరం భీమ్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నాడు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ డైలాగ్ డెలివరి, -డాన్స్ గురించి అందరికి తెలిసిందే. పాత్ర కోసం ఎంతటి రిస్క్ అయినా చేయడానికి వెనుకాడడు. అయితే ఆర్ ఆర్ ఆర్ సినిమా కోసం ఏకంగా ఎన్టీఆర్ రెండు సంవత్సరాల సమయాన్ని కేటాయించాడు.

ఎన్టీఆర్ కొమరం భీమ్ లుక్ కోసం చాలా కష్టపడ్డాడు. ఎన్టీఆర్ నుండి గతేడాది - ఈ ఏడాది ఏ సినిమాలు రాకపోవడం అభిమానులను నిరాశ పరిచే విషయం. లాక్ డౌన్ కారణంగా ప్రస్తుత సినిమా షూటింగ్స్ అన్నీ నిలిచిపోవడంతో విడుదల తేదీలన్నీ మరింత వాయిదా పడే అవకాశాలు కన్పిస్తున్నాయి. తాజాగా రాజమౌళి టీమ్ ఆర్ ఆర్ ఆర్ సినిమాను వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అంతేగాక ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో మరో సినిమా ఓకే చేసాడు. 'అయినను పోయిరావలె హస్తినకు' అనే టైటిల్ ఫిక్స్ చేసిన ఈ సినిమా షూటింగ్ లాక్ డౌన్ అనంతరం స్టార్ట్ అవుతుందట. అయితే ఈ సినిమా కూడా వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. అంటే 2021లో ఎన్టీఆర్ నుండి రెండు సినిమాలు తెరపైకి రానున్నాయన్నమాట. ఈ విషయం తెలిసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో సంబరాలు మొదలైనట్లే. త్రివిక్రమ్ సినిమాలో ఎన్టీఆర్ స్టైలిష్ లుక్ లో కనిపిస్తాడని సమాచారం.