Begin typing your search above and press return to search.

లేటు చేయకు తారక్‌.. భయంగా ఉంది

By:  Tupaki Desk   |   23 Oct 2015 6:08 PM IST
లేటు చేయకు తారక్‌.. భయంగా ఉంది
X
ఈ ఏడాది యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ సంక్రాంతి పండుగకు ఎంత డిజప్పాయింట్‌ చేశాడో తెలిసిందే. ''టెంపర్‌'' సినిమాను ఎట్టి పరిస్థితుల్లో జనవరిలో సంక్రాంతికి దించుతున్నాం అని చెప్పి.. చివరకు సినిమాను ఫిబ్రవరిలో విడుదల చేశారు. ఇప్పుడు కూడా మరోసారి సంక్రాంతికి వస్తోంది అంటూ ''నాన్నకు ప్రేమతో'' సినిమాను కన్ఫాం చేశారు. కాని...

నిజానికి ఈ నెల 20 నుండే స్పెయిన్‌ లో ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ మొదలవ్వాలి. కాకపోతే ఇంతవరకు అది మొదలవ్వలేదు. తాజాగా తెలుస్తున్న సంగతి ఏంటంటే.. నవంబర్‌ తొలి వారంలో ఈ షూట్‌ మొదలవుతుందట. ఎందుకంటే 30 లేదా 31న తన తొలి ప్రొడక్షన్‌ 'కుమారి 21 ఎఫ్‌' ఆడియో రిలీజ్‌ అవుతోంది కాబట్టి.. అది పూర్తయ్యాకనే సుకుమార్‌ షూట్‌ కు వస్తాడట. మరి 10 రోజులు లేటుగా సినిమా షూటింగ్‌ మొదలవుతోంది.. కరెక్టుగా జనవరి 8 రిలజ్‌ టైమ్‌ ను అందుకుంటారా?

గతంలో టెంపర్‌ విషయంలో కూడా ఇలాగే ఇండస్ర్టీ స్ర్టయిక్‌ అని.. కథలో చేంజ్‌ అని.. చాలా లేటయిపోయి.. చెప్పిన టైముకు సినిమాను అందించలేకపోయారు. అందుకే ఇప్పుడు తారక్‌ అభిమానులు కాస్త భయపడుతున్నారు. లేటు చెయ్యకయ్యా తారకూ!!