Begin typing your search above and press return to search.

అది నిజం కాదు.. మనసుకు నచ్చింది చేస్తా!

By:  Tupaki Desk   |   9 Oct 2018 8:09 AM GMT
అది నిజం కాదు.. మనసుకు నచ్చింది చేస్తా!
X
యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ మరో రెండు రోజుల్లో ‘అరవింద సమేత’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ అంచనాలకు తగ్గట్లుగా సినిమా ఉంటుందనే నమ్మకంతో ఎన్టీఆర్‌ ఉన్నాడు. ఇక ఈ చిత్రం ప్రమోషన్‌ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్‌ పలు ఆసక్తికర విషయాలను వెళ్లడి చేశాడు.

ఎన్టీఆర్‌ గతంలో కేవలం సక్సెస్‌ దర్శకులతో మాత్రమే సినిమా చేసేందుకు ఆసక్తి చూపించేవాడని - ఒక దర్శకుడు సక్సెస్‌ సాధిస్తే వెంటనే ఆ దర్శకుడితో సినిమా చేసేవాడని టాక్‌ ఉంది. సక్సెస్‌ దర్శకుల వెంటపడుతాడు అంటూ గతంలో ఉన్న టాక్‌ గురించి తాజాగా ఎన్టీఆర్‌ ముందు ప్రస్తావించగా.. నేను మనసుకు నచ్చిన సినిమాలు మాత్రమే చేస్తాను, మంచి కథలను మాత్రమే ఎంపిక చేసుకోవాలనుకుంటాను, సక్సెస్‌ దర్శకులతో మాత్రమే సినిమా చేయాలని నేను అనుకోను.

నేను ఒక దర్శకుడితో సినిమా చేయాలనుకుంటే అతడు ఫ్లాప్‌ లో ఉంటాడు, ఆ తర్వాత నేను హిట్‌ ఇస్తాను - నేను ఫ్లాప్‌ లో ఉన్నప్పుడు దర్శకుడు హిట్‌ ఇస్తాడు. ఇవన్నీ అలా జరిగి పోతున్నాయని - ఏది ప్లాన్‌ చేసుకుని చేసేది కాదు - మంచి కథతోనే సినిమా చేయాలని అనుకుంటాం కాని సక్సెస్‌ దర్శకులతోనే సినిమాలు చేయాలని అనుకోమని - ఆ ప్రచారం నిజం కాదని ఎన్టీఆర్‌ తేల్చి చెప్పాడు. త్రివిక్రమ్‌ అజ్ఞాతవాసి ఫ్లాప్‌ అయిన నేపథ్యంలో ఎన్టీఆర్‌ ఈ చిత్రంతో త్రివిక్రమ్‌ కు సక్సెస్‌ ఇస్తాడేమో చూడాలి.