Begin typing your search above and press return to search.

RRR రామారావు గారి హాలీవుడ్ స్టైలింగ్ చూశారా?

By:  Tupaki Desk   |   28 Dec 2021 8:00 PM IST
RRR రామారావు గారి హాలీవుడ్ స్టైలింగ్ చూశారా?
X
ఇది నిజంగా అద్భుతం. ఇలాంటి ఫ్యాష‌న్ అనుక‌ర‌ణ ఆలోచ‌న పుట్టింది మాత్రం హాలీవుడ్ నుంచే. ఆర్.ఆర్‌.ఆర్ లో తార‌క్ గెట‌ప్ అంత‌గా ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. అస‌లు ఇంత సింపుల్ గా క‌నిపించే ఆ గెట‌ప్ కి లెద‌ర్ డిజైన్ అంతే అద్భుతంగా కుదిరింది. అస‌లు మాన్ స్ట‌ర్ మ్యాన్ అనేవాడు ఒక‌డుంటాడ‌ని .. లేదా అంతం లేని అరాచ‌కులు ఉంటార‌ని చూపించారు 300 సినిమాలో. 8 అడుగుల ఎత్తుతో జ‌క్సిస్ అనే హిజ్రా మ‌హారాజునే సృష్టించారు మ‌హానుభావులు. భారీ యాక్ష‌న్ న‌డుమ మ‌నుషులు వింత ఆహార్యాలు విచిత్రాలు ఆ సినిమాలో క‌ట్టి ప‌డేస్తాయి. ఒక గూని (బ‌దిర‌) వీరుడితో స్పార్ట‌న్ కింగ్ అయిన గ్రీకువీరుడిని హైలైట్ చేసే స‌న్నివేశాలు వావ్వా అనిపిస్తాయి. ఇక ప్ర‌తి పాత్ర‌కు ఒక ప్ర‌త్యేక‌మైన వేష‌ధార‌ణ ఆహార్యాన్ని డిజైన్ చేసిన తీరు మ‌హ‌దాద్భుతం.

బ‌హుశా రాజ‌మౌళి అండ్ కాస్ట్యూమ్ డిజైన‌ర్ టీమ్ కి అలాంటి స్ఫూర్తి ఎప్పుడూ ఉంటుంది. ఇంత‌కుముందు బాహుబ‌లి చిత్రంలో ప్ర‌భాస్ - రానాల‌ను ఇండియ‌న్ ట్రెడిష‌న్ మిస్ కాకుండా వారి ని డిజైన్ చేసిన తీరు ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ అనే స్వాతంత్య్ర నేప‌థ్యం ఉన్న సినిమాలోనూ వీరుల్ని అంతే గొప్ప‌గా చూపిస్తున్నారు. ఎంపిక చేసుకున్న కాస్ట్యూమ్స్ నిజంగా ఆశ్చ‌ర్య‌రుస్తున్నాయి. మ‌న్యం వీరుడే క‌దా! అని అనుకుంటే పొర‌పాటే. ఆ వీరుడిని ఎంత అందంగా ప్రెజెంట్ చేయాలో జ‌క్క‌న్న‌కు తెలిసినంత‌గా ఇంకెవ‌రికీ తెలీదేమో అన్నంత‌గా తార‌క్ పాత్ర‌ను అత‌డు డిజైన్ చేశారు.

తాజాగా రిలీజ్ చేసిన ఆర్.ఆర్.ఆర్ కొత్త పోస్ట‌ర్ లో తార‌క్ కాస్ట్యూమ్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఆ పంచె క‌ట్టు.. ష‌ర్ట్ మీదుగా లెద‌ర్ బ్యాగ్ .. దానికి పులి గోళ్లు.. ఇక ఆ చేతికి లెద‌ర్ ని చుట్టుకుని ఆ స్టైలే వేర‌బ్బా అంటూ పొగిడేస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్ చిత్రంలో పులితోనూ పోరాటంలో తార‌క్ ఆహార్యం ఒక రేంజులో కుదిరింది. ఓవ‌రాల్ గా ఈ సినిమా అటు బాలీవుడ్ కి ఎంతో క‌నెక్ట‌యిపోతుంద‌ని ట్రైల‌ర్ చెప్ప‌క‌నే చెప్పింది. జ‌న‌వ‌రి 7న రిలీజ్ కాబ‌ట్టి ఒక‌రోజు ముందే ప్రీమియ‌ర్ల‌తో రిపోర్టులు అందేస్తాయి. అంత‌వ‌రకూ వేచి చూడాల్సిందే. ఇక రాజ‌మౌళి ఇలాంటి సినిమాలు చేస్తూ త‌దుప‌రి 300 .. ట్రాయ్ రేంజులో సినిమాలు తీసి తెలుగు ప్రేక్ష‌కుల్ని రంజింప‌జేయాల‌ని ఆకాంక్షిద్దాం.