Begin typing your search above and press return to search.

త్రివిక్రమ్ సినిమాలో ఎన్టీఆర్ అలా

By:  Tupaki Desk   |   31 Oct 2017 9:59 AM IST
త్రివిక్రమ్ సినిమాలో ఎన్టీఆర్ అలా
X
ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ జై లవ కుశ.. బాక్సాఫీస్ దగ్గర పర్లేదని అనిపించింది. పండుగ సెలవుల్లో రిలీజ్ కావడం.. బాగానే కలిసొచ్చినా.. సెకండ్ వీక్ లో ఆశించిన స్థాయిలో పెర్ఫామ్ చేయలేకపోవడంతో.. స్వల్ప నష్టాలతో సరిపోయింది. అయితే.. తన మరుసటి చిత్రాన్ని జనవరి చివరి నుంచి ప్రారంభించబోతున్నాడు జూనియర్.

రీసెంట్ గా మూవీ లాంఛింగ్ కార్యక్రమం జరగగా.. తన గత గెటప్ లోనే కనిపించాడు ఎన్టీఆర్. నాన్నకు ప్రేమతో సమయం నుంచి వరుసగా తన సినిమాల్లో గెడ్డం లుక్ లోనే ఉంటున్నాడు. రాబోయే సినిమాలో మాత్రం ఎన్టీఆర్ లుక్ కొత్తగా ఉంటుంది. క్లీన్ షేవ్డ్ లుక్ లోకి మారబోతున్నాడని తెలుస్తోంది. సహజంగా త్రివిక్రమ్ సినిమాలంటే ఫ్యామిలీ డ్రామాలే ఉంటాయ్. ఎన్టీఆర్ నటించిన ఫ్యామిలీ మూవీ బృందావనం. ఆ సినిమా మాదిరిగానే క్లీన్ షేవ్ తో.. లైట్ గా మీసకట్టు ఉండే లుక్ తో త్రివిక్రమ్ సినిమాలో కనిపించనున్నాడట.

ఇక పర్సనల్ టూర్ విషయానికి వస్తే.. మరో రెండు నెలలు ఎన్టీఆర్ బిజీ. కొడుకు అభయ్ రామ్ వీసా ప్రక్రియ ఆలస్యం కావడంతో.. ఫారిన్ టూర్ లేట్ అయింది. ఇప్పుడు ఆ సమస్య కూడా తీరిపోవడంతో.. ముందుగా ప్లాన్ చేసుకున్న లాంగ్ టూర్ కు ఫ్యామిలీతో కలిసి బయల్దేరుతున్నాడట ఎన్టీఆర్.