Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : ఎన్టీఆర్‌ రెడీ.. బరిలోకి దిగడమే ఆలస్యం

By:  Tupaki Desk   |   11 Jan 2022 11:30 AM GMT
పిక్ టాక్ : ఎన్టీఆర్‌ రెడీ.. బరిలోకి దిగడమే ఆలస్యం
X
యంగ్‌ టైగర్ ఎన్టీఆర్‌ ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమాను ముగించి కొరటాల శివ సినిమాలో ఇప్పటికే జాయిన్ అవ్వాల్సి ఉంది. కాని కరోనా కారణంగా ఆర్ ఆర్‌ ఆర్‌ ఆలస్యం అవ్వడంతో కొరటాల శివ సినిమాను ఇప్పటి వరకు మొదలు పెట్టలేదు. జక్కన్న ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది.. అన్ని అనుకున్నట్లుగా జరిగితే మొన్న సంక్రాంతి కానుకగా సినిమా విడుదల అయ్యి ఉండేది. కరోనా థర్డ్‌ వేవ్‌ ఆర్‌ ఆర్‌ ఆర్‌ ను వాయిదా వేయించింది. ఆర్ ఆర్ ఆర్‌ విడుదలతో సంబంధం లేకుండా ఎన్టీఆర్‌ తన తదుపరి సినిమాను పట్టాలెక్కించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ సినిమా విడుదల సమయంలో మళ్లీ నెల రోజుల పాటు ప్రమోషన్‌ కార్యక్రమాలకు ఎన్టీఆర్‌ హాజరు అవుతాడు. ఆలోపు కొరటాల శివ సినిమాను ఎన్టీఆర్ మొదలు పెట్టే అవకాశం ఉందంటున్నారు.

ఎన్టీఆర్‌ మరియు కొరటాల శివ కాంబోలో రూపొందబోతున్న సినిమాకు సంబంధించిన వార్తలు గత కొన్నాళ్లుగా వస్తూనే ఉన్నాయి. ఈ సినిమా కోసం ఎన్టీఆర్‌ ను బరువు తగ్గాల్సిందిగా కొరటాల సూచించాడనే ప్రచారం జరిగింది. ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా లోని కొమురం భీమ్ పాత్రకు గాను ఎన్టీఆర్ కాస్త బరువు పెరిగిన మాట వాస్తవం. ఇప్పుడు కొరటాల శివ సినిమా కోసం ఆ బరువు తగ్గాడు. కొరటాల శివ సినిమా కు కావాల్సిన విధంగా ఎన్టీఆర్‌ లుక్ మారింది. ఆ విషయాన్ని ఎన్టీఆర్‌ స్టైలిస్ట్‌ అయిన అశ్విన్ మావ్లే ఈ ఫొటోలను షేర్‌ చేయడం ద్వారా చెప్పకనే చెప్పాడు.

ఎన్టీఆర్‌ ను ఇలా చూసిన అభిమానులు త్వరగా మొదలు పెట్టండి కొరటాల గారు అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. ఎన్టీఆర్‌ ప్లానింగ్‌ సరిగా లేక పోవడం వల్ల ఎక్కువ సమయం వృదా అవుతుంది అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. ఈ వృదా అయిన సమయంను ఎన్టీఆర్‌ బ్యాలన్స్ చేయాలంటే ఏడాదికి రెండు మూడు సినిమాలు అయినా చేయాలి. అలా చేస్తేనే ఆర్‌ ఆర్‌ ఆర్‌ కు ఇచ్చిన మూడు ఏళ్ల డేట్లు కవర్ అవుతాయి అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్‌ ఎలాగూ రెడీగా ఉన్నాడు.. ఇక బరిలోకి దిగడం అనేది కొరటాల శివ నిర్ణయంపై ఉన్నట్లుగా టాక్ వినిపిస్తుంది. కొరటాల శివ ఆచార్య సినిమా విడుదల అయ్యే వరకు ఎన్టీఆర్‌ తో సినిమాను మొదలు పెట్టడా అన్నట్లుగా కొందరు ప్రశ్నిస్తున్నారు. మరి కొరటాల నుండి ఆ ప్రశ్నకు సమాధానం ఏమని వస్తుందో చూడాలి.