Begin typing your search above and press return to search.

బాహుబలి రికార్డుకు ఎసరు పెట్టిన ఎన్టీఆర్

By:  Tupaki Desk   |   4 Jan 2016 11:00 PM IST
బాహుబలి రికార్డుకు ఎసరు పెట్టిన ఎన్టీఆర్
X
దర్శకధీరుడు రాజమౌళి బాహుబలితో సృష్టించిన రికార్డులు బద్దలుకొట్టడం ఎవరి వల్లా కాదనే అనుకున్నారు ఇన్నాళ్లు. కానీ పట్టుమని ఆరు నెలలు గడవకుండానే.. ఆ చిత్రరాజం సృష్టించిన ఓ రికార్డును ఎన్టీఆర్ తిరగరాసేశాడు. రికార్డులు ఉండేవి బద్దలు కొట్టడానికే అని ప్రూవ్ చేశాడు.

ఇప్పటివరకూ యూట్యూబ్ లో నాన్నకు ప్రేమతో ట్రైలర్ కు వచ్చిన వ్యూస్ 25 లక్షలకు పైగానే. అలాగే 37వేల మంది ఈ ట్రైలర్ ను లైక్ చేశారు. అది కూడా కేవలం ఒక వారం సమయంలోనే. కానీ జక్కన్న బాహుబలి ట్రైలర్ కి లైఫ్ టైంలో వచ్చిన వ్యూస్ 34 వేలు. ఇది తెలుగు సినిమాలన్నిటిలోకీ పెద్ద రికార్డ్. ఇంత పెద్ద రికార్డ్ ని కేవలం వారం రోజుల్లోనే బద్దలయిపోయిందంటే.. ఎన్టీఆర్ నుంచి ఓ పర్ఫెక్ట్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతగా ఎదురుచూస్తున్నారనే విషయం అర్దమవుతుంది. మరోవైపు ఈ ట్రైలర్ లో ఉన్న కంటెంట్ కూడా ఈ ఫీట్ ను అందుకునేందుకు ఉపయోగపడిందని చెప్పేందుకు సందేహం అక్కర్లేదు.

అందమైన లొకేషన్స్ - అద్భుతమైన ఫోటోగ్రఫీకి - ఆకట్టుకునే ఎన్టీఆర్ - కట్టిపడేసే ఎమోషన్స్.. నాన్నకు ప్రేమతో ట్రైలర్ కి ప్రాణంగా నిలిచాయి. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో.. జగపతిబాబు విలన్ రోల్ చేయగా.. జూనియర్ కి తండ్రిగా రాజేంద్ర ప్రసాద్ నటించారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ రోల్ లో కనిపించనుంది. మరోవైపు కుమారి 21ఎఫ్ తో అలరించిన హేభా పటేల్.. ఓ ప్రధాన పాత్రలో నటించింది.