Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ తల్లిమెచ్చిన జనతా గ్యారేజ్!

By:  Tupaki Desk   |   1 Sept 2016 10:52 AM IST
ఎన్టీఆర్ తల్లిమెచ్చిన జనతా గ్యారేజ్!
X
కొరటాల శివ - నందమూరి తారకరామారావు ల కాంబినేషన్ లో వచ్చిన జనతాగ్యారేజ్ సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదలయ్యింది. అయితే ఈ సినిమాను బుదవారమే చూశేశారు జూనియర్ ఎన్టీఆర్. ఇప్పటికే ఈ సినిమా ఆడియో సూపర్ హిట్ - సినిమా కూడా మంచి టాక్ తెచ్చుకుంటున్న సమయంలో ఎన్టీఆర్ ఆ సెలబ్రేషన్స్ ని ముందే అనుభవించేశాడట. ఈ మేరకు సినిమా విడుదలకు ఒకరోజు ముందే.. ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులతో ఈ స్పెషల్ షోని చూశారు. అయితే ఈ సినిమా పై జూనియర్ ఎన్టీఆర్ తల్లి - కుటుంబ సభ్యులు - ముఖ్యంగా అతని భార్య ఎలా స్పందించారో ఇప్పుడు చూద్దాం.

జనతా గ్యారేజ్ మూవీ విడుదలకు ఒకరోజు ముందే తన కుటుంబ సభ్యులతో కలిసి స్పెషల్ షో చూసిన ఎన్టీఆర్ తల్లి.. ఈ సినిమాపైనా, కొడుకు నటనపైనా ప్రశంసలు కురిపించారట. ఈ సినిమా చాలా బాగుందని, అబ్బాయి చాలా బాగా చేశారని కాంప్లిమెంట్స్ ఇచ్చారట. ఇక జూనియర్ ఎన్టీఆర్ భార్య ప్రణతి కూడా జనతా గ్యారేజ్ లో తన భర్త నటన సూపర్బ్ గా ఉందని ప్రశంసించినట్టు తెలిసింది. ముఖ్యంగా తారక్ డాన్సులకు ప్రణతి మరోసారి ఫిదా అయిపోయారని చెబుతున్నారు. ఇక ఈ చిత్ర ప్రముఖులు - యూనిట్ మెంబర్స్ కూడా ఈ సినిమా చాలా బాగా వచ్చిందని సంతృప్తి చెందినట్టు టాక్ నడుస్తుంది.