Begin typing your search above and press return to search.
లిరికల్ వీడియో: దేవుడి కన్నా ఎక్కువ
By: Tupaki Desk | 23 Dec 2018 5:31 PM ISTక్రమం తప్పకుండా పోస్టర్లను వదులుతూ హైప్ ని నిలబెట్టుకుంటూ వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ మొన్న జరిగిన ఆడియో వేడుకలో ట్రైలర్ ను వదిలి వాటిని పీక్స్ లోకి తీసుకెళ్ళిపోయింది. ఆడియోకు రెస్పాన్స్ కూడా బాగానే ఉంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఎన్టీఆర్ టీం మరో లిరికల్ వీడియోను విడుదల చేసింది. ఇది ఇప్పటికే రిలీజైన జ్యూక్ బాక్స్ లో లేనిది. సినిమాలో వాడారో లేదో తెలియదు కాని ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ ఇచ్చేలా ఇదే ఉండటం విశేషం.
భాస్కర భట్ల సాహిత్యంతో ఉన్న ఈ పాట ఆద్యంతం ఎన్టీఆర్ లక్షణాలను గుణగణాలను పొగుడుతూ సాగింది. కాల భైరవ గాత్రంలో బ్యాక్ గ్రౌండ్ లో మంచి బేస్ ఉన్న కోరస్ లో హుషారునిచ్చేలా ఉంది. రాముడు వేషం కట్టినప్పుడు గుండెలు గుడులు కావడం కృష్ణుడిలా వస్తే హృదయాలు వెన్నముద్దలై పోవడం ఇలా మొత్తం ఆయన వ్యక్తిత్వాన్ని గొప్పగా వర్ణిస్తూ సాగింది. ఫైనల్ గా దేవుడి కన్నా ఎక్కువ ఎన్టీఆరే అనేలా ఇది సాగింది.
నిజం చెప్పాలంటే ఇది ఆల్బమ్ లో ఎందుకు లేదో అర్థం కావడం లేదు. ఒకవేళ ఎదైనా సర్ప్రైజ్ గా ప్లాన్ చేశారేమో కానీ టైటిల్ సాంగ్ తర్వాత ఇదే బెస్ట్ సాంగ్ అనిపించడం మాత్రం నిజం. జ్యుక్ బాక్స్ లో కథానాయకుడు మహానాయకుడు కలిపి మొత్తం ఆరు పాటలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడిది తోడయ్యింది కాబట్టి మొత్తం ఏడయ్యాయి. ఇది ఎండ్ టైటిల్స్ లో ఉంటుందా లేక బ్యాక్ గ్రౌండ్ లో వస్తుందా తెలియదు. సాంగ్ మొదట్లో వచ్చే ఎన్టీఆర్ అనే కోరస్ మాత్రం ఓ రేంజ్ లో ఉంది. జూనియర్ ఫ్యాన్స్ కూడా ఈ ఒక్క బిట్ ని ఫ్యూచర్ లో వాడుకోవచ్చు అనేలా ఉంది.

వీడియో కోసం క్లిక్ చేయండి