Begin typing your search above and press return to search.

తారక్‌ ఎంతిచ్చినా.. ఫిట్టింగ్‌ పెట్టేశాడుగా

By:  Tupaki Desk   |   8 Jan 2016 8:51 AM GMT
తారక్‌ ఎంతిచ్చినా.. ఫిట్టింగ్‌ పెట్టేశాడుగా
X
నిజానికి ఇప్పుడందరూ జూనియర్‌ ఎన్టీఆర్‌ ఒకేసారి ఒకే బుల్లెట్టుతో రెండు పక్షులను కొట్టేస్తున్నాడని అంటున్నారు. ఎందుకంటే మనోడు మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్ లో గెలుచుకున్న 12.5 లక్షల డబ్బులను తన బాబాయ్‌, మావయ్యలకు డొనేట్‌ చేయడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌ గా మారిపోయింది కాబట్టి.

మ్యాటర్‌ ఏంటంటే.. తాను గెలుచుకున్న 12.5 లక్షల్లో సగం డబ్బులను బసవతారకం క్యాన్సర్‌ ట్రస్టుకు.. మిగిలిన సగం డబ్బులను ఎన్టీఆర్‌ ట్రస్టుకు డొనేట్‌ చేశాడట ఎన్టీఆర్‌. నాన్నకు ప్రేమతో సినిమాను మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాంలో ప్రమోట్‌ చేసుకున్న తారక్‌.. తాను గెలిచిన డబ్బులను ఇలా డొనేట్‌ చేయడం బాగానే ఉంది. అయితే మనోడు బాబాయ్‌.. మావయ్యలకు.. సత్సంబంధాలు మెరుగుపరుచుకోడానికి గ్రీన్‌ సిగ్నల్స్‌ ఇచ్చేందుకు ఇలా చేశాడని వేరే చెప్పక్కర్లేదు.

కాని.. ఒక ప్రక్కన తన నాన్నకు ప్రేమతో సినిమాను సంక్రాంతి బరిలోకి దించేసి.. షుమారు ఒక 300 ధియేటర్లను దక్కకుండా చేసి.. ఇప్పుడు ఇలా డొనేషన్‌ ఇస్తే దానిని ఏమని వర్ణించాలి గురూ? దీన్నే బుగ్గ గిల్లి జోల పాడటం అంటారు అంటూ విమర్శకులు పంచ్‌ లు వేస్తున్నారు మరి. పెట్టాల్సిన ఫిట్టింగ్‌ ధియేటర్ల దగ్గర పెట్టేసి.. ఇక ఎంత డొనేట్‌ చేస్తే ఏం లాభం అబ్బాయ్‌??