Begin typing your search above and press return to search.

పాత రూటులోనే వెళ్తున్న తారక్‌

By:  Tupaki Desk   |   29 March 2016 6:49 AM GMT
పాత రూటులోనే వెళ్తున్న తారక్‌
X
ఇప్పుడు ఫోకస్‌ అంతా యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ లుక్‌ మీదనే. ఎందుకంటే బాద్షా సినిమాలో స్ర్టయిట్‌ హెయిర్‌ లుక్‌ తో రఫ్ఫాడించిన తారక్‌.. ఆ తరువాత నాన్నకు ప్రేమతో సినిమాలో ఏకంగా అల్ర్టా మోడ్రన్‌ హెయిర్‌ స్టయిలింగ్‌ తో అదరగొట్టేశాడు. అందుకే ఇప్పుడు జనతా గ్యారేజ్‌ సినిమా కోసం మనోడు ఏం చేయబోతున్నాడనేది తెలుసుకోవడానికి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఎన్టీఆర్‌ తన హెయిర్‌ ను న్యాచురల్‌ గా వదిలేస్తే.. అది కర్లీ కర్లీగా వచ్చేస్తుంది. ఆ గింగిరాల జుట్టుతో ఇప్పటికే చాలాసార్లు మ్యాజిక్‌ చేశాడు. ఇకపోతే నాన్నకు ప్రేమతో వంటి డిఫరెంట్‌ స్టయిల్‌ తో మెస్మరైజ్‌ చేశాక.. ఇప్పుడు మాత్రం కొత్తగా వేరే స్టయిల్‌ ఏదీ తారక్‌ ప్రయత్నించట్లేదు. ఆ పాత కర్లీ హెయిర్‌ తోనే ఈసారి ట్రీట్‌ ఇవ్వాలనే డిసైడ్‌ అయ్యాడట. అస్తమానం ఏదో ఒకటి కొత్తగా చేస్తే.. తన న్యాచురల్‌ లుక్‌ లో ఉన్న కిక్‌ అభిమానులు మిస్సవుతారు కాబట్టే.. ఈసారికి సేమ్‌ తన పాత హెయిర్‌ స్టయిల్ తో మాసిన గెడ్డం లుక్‌ లోనే ముందుకెళదాం అని కొరటాల శివకు చెప్పాడట.

అదిగో మీరు చూస్తున్నారుగా.. మొన్న ముంబయ్‌ లో షూటింగ్‌ జరిగినప్పుడు అక్కడ ఒక యాక్షన్‌ ఎపిసోడ్‌ లో తారక్‌ అలా కనిపించాడు. ఈ ఫోటో చూస్తే మీకు ఆ లుక్‌ గురించి అర్దమైపోతోందిగా...