Begin typing your search above and press return to search.

పోస్టర్ టాక్: 'లక్ష్మిస్ ఎన్టీఆర్' వర్మ మార్క్

By:  Tupaki Desk   |   26 Sept 2017 10:24 PM IST
పోస్టర్ టాక్: లక్ష్మిస్ ఎన్టీఆర్ వర్మ మార్క్
X
ఎంత మంది దర్శకులు ఉన్నా డైరెక్షన్ అనే పదానికి కరెక్ట్ నిర్వచనం గా చెప్పుకునే దర్శకులు కొందరే ఉంటారు. ప్రతి ఒక్కరు సినిమా అనేది వ్యాపారంగానే చూస్తున్నారు కమర్షియల్ హంగులు పోయి అసలైన కథల్ని కరెక్ట్ గా తెరకెక్కించడం మానేస్తున్నారు. ఇంకా కల్పిత కథలతోనే సినిమాలను తీస్తున్నారు. కానీ అసలు జీవితాల్ని తెరపై ధైర్యంగా చూపించే వాడు ఒక్కడున్నాడు. ఆయన ఎక్కువగా అపజయ చిత్రాలనే తీసి ఉండవచ్చు కానీ తన ఆలోచన లను ఇతరుల కోసం ఎప్పుడు మార్చుకోలేదు. ఆయన ఎవరో కాదు తన శక్తి వరకు వివాదాస్పద కథలను ధైర్యంగా తియ్యగల సమర్థుడు రామ్ గోపాల్ వర్మ.

చరిత్రలో కొన్ని ప్రశ్నలను మిగిల్చిన విశ్వ విఖ్యాత నటుడి మరణం కి ముందు జరిగిన కొన్ని ఘటనలను ఆధారంగా చేసుకొని "లక్ష్మిస్ ఎన్టీఆర్" అనే సినిమాను తెరకెక్కిస్తాను అని చెప్పిన సంగతి తెల్సిందే. అయితే ఆ కథను రామ్ గోపాల్ వర్మ స్టార్ట్ చేసినట్లే అనిపిస్తోంది. రీసెంట్ గా చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ని వర్మ రిలీజ్ చేశాడు. ఒక్క టైటిల్ లోనే అందరిని ఆకట్టుకున్న వర్మ టైటిల్ లోగో లో లక్ష్మీ పేరును ఎరుపు రంగులో ఉంచడం వెనుక అనేక అర్దాలను చెప్పాడని చెప్పవచ్చు. ఇక ఎన్టీఆర్ పేరు పసుపు రంగులో ఉండడం అది దేనికి చిహ్నమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఫోటో విషయానికొస్తే ఒక పోస్టర్ లో సినిమా కాన్సెప్ట్ ని చెప్పడం అంటే చాలా కష్టమని చెప్పాలి. ఫోటో లో ఎంత అర్థముందో తెలిస్తే ఎవ్వరికైనా వర్మ టాలెంట్ ఎంటో అర్థమవుతోంది. ఈ ఒక్క పోస్టర్ తో మిగతా టాప్ దర్శకులకు వర్మ కు తేడా ఏంటో తెలిసిపోతోంది.. మహిళ చెప్పు వదిలి పెద్దాయన ఉన్న చీకటి ఇంట్లోకి అడుగుపెట్టడం చూస్తుంటే..సినిమా లోని అసలు అర్దాన్ని ఆ షాట్ లోనే క్లియ్యర్ గా చెప్పేశాడు వర్మ. పోస్టర్ లోనే ఇంత అర్దాన్ని చెప్పిన వర్మ సినిమాలో ఇంకెంత అర్దాన్ని చెబుతాడో చూడాలి.