Begin typing your search above and press return to search.

అన్‌ సీజన్‌ లో క్రేజ్‌ లేని సినిమాలు

By:  Tupaki Desk   |   21 Feb 2019 6:30 AM GMT
అన్‌ సీజన్‌ లో క్రేజ్‌ లేని సినిమాలు
X
2019వ సంవత్సరం ప్రారంభం అయ్యి రెండు నెలలు ముగియబోతుంది. కాని ఇప్పటి వరకు టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద 'ఎఫ్‌2' మాత్రమే సక్సెస్‌ ను దక్కించుకుంది. చిన్న చిత్రంగా విడుదలైన 'ఎఫ్‌ 2' చిత్రం సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. చిత్ర యూనిట్‌ సభ్యులు ఊహించని రీతిలో వసూళ్లను రాబట్టింది. సంక్రాంతి సీజన్‌ లో దిగిన వినయ విధేయ రామ మరియు ఎన్టీఆర్‌ కథానాయకుడు చిత్రాలు బొక్క బోర్లా పడ్డాయి. ఆ తర్వాత కూడా పలు సినిమాలు విడుదల అయ్యాయి. కాని ఏ ఒక్కటి కలెక్షన్స్‌ పరంగా హిట్‌ అవ్వలేదు.

ఫిబ్రవరిలో సహజంగానే పెద్దగా కలెక్షన్స్‌ రావు. అలాంటిది చిన్నా చితకా సినిమాలు రావడంతో ఏ ఒక్కదానికి కూడా సరైన కలెక్షన్స్‌ రావడం లేదు. ఈ సమయంలోనే విడుదల కాబోతున్న 'ఎన్టీఆర్‌ మహానాయకుడు' చిత్రంపై బాక్సాఫీస్‌ విశ్లేషకుల దృష్టి ఉంది. కథానాయకుడు కలెక్షన్స్‌ విషయంలో ఫ్లాప్‌ అయ్యింది. మహానాయకుడు సినిమా కూడా వసూళ్లను సాధిస్తుందనే నమ్మకం లేదు. రెండు నెలల క్రితం ఎన్టీఆర్‌ బయోపిక్‌ పై అంచనాలు భారీగా ఉన్నాయి. కాని ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కనీసం మంచి ఓపెనింగ్స్‌ అయినా వచ్చే పరిస్థితి లేదు. కథానాయకుడుకు మంచి ఓపెనింగ్స్‌ వచ్చినా లాంగ్‌ రన్‌ కలెక్షన్స్‌ రాలేదు. ఇప్పుడు మహానాయకుడుకు ఓపెనింగ్స్‌ రావని ఇప్పటికే అడ్వాన్స్‌ బుకింగ్‌ ద్వారా తేలిపోయింది.

ఇక ఈ వారం 'ఎన్టీఆర్‌ మహానాయకుడు' మాత్రమే కాకుండా కామెడీ చిత్రం 'మిఠాయి' కూడా రాబోతుంది. 'పెళ్లి చూపులు' స్టార్స్‌ అయిన ప్రియదర్శి - రాహుల్‌ రామకృష్ణలు ఈ చిత్రంలో హీరోలుగా నటించారు. ఈ చిత్రంపై కూడా జనాల్లో పెద్దగా ఆసక్తి లేదు. పెద్ద ఎత్తున పబ్లిసిటీ చేయక పోవడంతో 'మిఠాయి' సినిమా బజ్‌ క్రియేట్‌ కాలేదు. అసలే ఫిబ్రవరి అన్‌ సీజన్‌ ఇలాంటి సమయంలో ఈ రెండు క్రేజ్‌ లేని సినిమాలు వస్తున్నాయి. మరి ఈ రెండింటిలో ఏది మంచి వసూళ్లు సాధించినా కూడా అదో అద్బుతమే అని చెప్పుకోవచ్చు.