Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ కథానాయకుడు వచ్చేస్తున్నాడు

By:  Tupaki Desk   |   7 Feb 2019 1:04 PM GMT
ఎన్టీఆర్ కథానాయకుడు వచ్చేస్తున్నాడు
X
అదేంటి ఆల్రెడీ వచ్చేసి నష్టాలు కూడా మూటగట్టుకున్నాడుగా అనుకోకండి. ఇప్పుడున్న కొత్త ట్రెండ్ లో సినిమా రిలీజ్ రెండు రకాలుగా జరుగుతోంది. ఒకటి థియేట్రికల్ రిలీజ్. రెండు అమెజాన్ ప్రైమ్ విడుదల. అంతగా డిజిటిల్ వీడియో స్ట్రీమింగ్ లో చొచ్చుకుపోతున్న ఈ సంస్థ ఇవాళ సినిమా ప్రేమికులకు మరో కానుక అందించబోతోంది. కెజిఎఫ్ చాప్టర్ 1 వచ్చి రెండు రోజులు గడవకుండానే తన సైట్ లో ఎన్టీఆర్ కథానాయకుడుని ఇవాళ అర్ధరాత్రి నుంచి అందుబాటులో ఉంచబోతోంది.

ఈ మేరకు నిర్మాత వారాహి అఫీషియల్ ఫేస్ బుక్ పేజీలో అప్ డేట్ కూడా పెట్టేసారు. సరిగ్గా 30 రోజుల గడువు పూర్తి కావడం ఆలస్యం ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా అమెజాన్ సబ్స్క్రయిబర్స్ కోసం అందుబాటులోకి తెచ్చేస్తోంది. ఎన్టీఆర్ కథానాయకుడు థియేటర్ లో ఫెయిల్ అయినా దానికి వచ్చిన టాక్ కు ఆన్ లైన్ లో మంచి స్పందన దక్కే అవకాశం చాలా ఉంది. ఇంకా మహానాయకుడు షూటింగ్ పూర్తి కాకుండా విడుదల తేదీ ఖరారు చేయకముందే ఇలా కథానాయకుడు ఆన్ లైన్ లో అందుబాటులోకి రావడం విశేషం.

అన్నట్టు సంక్రాంతి సినిమాలన్నీ అమెజాన్ ఖాతాలోనే ఉన్నాయి. దీన్ని బట్టి తెలుగు సినిమా మీద ఎంత భారీ పెట్టుబడులు పెడుతుందో అర్థమవుతోంది. ఎన్టీఆర్ కథానాయకుడు బయోపిక్ లో మొదటి భాగం కాగా కమర్షియల్ ఫెయిల్యూర్ గా నిలిచినప్పటికీ టాక్ తో పాటు రివ్యూస్ కూడా బాగా వచ్చాయి. సో ఈ లెక్కన డిజిటల్ తో పాటు శాటిలైట్ కూడా వర్క్ అవుట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో మూవీ లవర్స్ తాపీగా ఎన్టీఆర్ కథానాయకుడుని ఇవాళ మిడ్ నైట్ నుంచే స్మార్ట్ డివైజెస్ లో చూసేయొచ్చు