Begin typing your search above and press return to search.

కథానాయకుడి ముహూర్తం ఫిక్స్

By:  Tupaki Desk   |   7 Jan 2019 7:49 AM GMT
కథానాయకుడి ముహూర్తం ఫిక్స్
X
నందమూరి అభిమానులు కౌంట్ డౌన్ మొదలుపెట్టుకున్నారు. ఎప్పుడెప్పుడు వెండి తెర పై తమ హీరో విశ్వరూపం చూద్దామని తహతహలాడుతున్నారు. అయితే బెనిఫిట్ షోలు చూస్తే వచ్చే కిక్ వేరు కాబట్టి ఫ్యాన్స్ వాటి టికెట్ల కోసం అప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టారు. విశ్వసనీయ సమాచారం మేరకు కథానాయకుడు మొదటి షో ఉదయం 5 గంటలకు పడేలా బాలయ్య ముహూర్తం సెట్ చేయించారని టాక్. తెలంగాణాలో వీటికి పర్మిషన్ లేదు కాబట్టి ప్రత్యేకంగా అనుమతి తీసుకుని కూకట్ పల్లిలో ఉన్న భ్రమరాంబ థియేటర్లో మాత్రమే ఒక్క షో వేస్తారట.

దానికి బాలయ్య టీం తో సహా యూనిట్ మొత్తం హాజరవుతుందని తెలిసింది. ఇక మీడియా ప్రతినిధుల సంగతి సరేసరి. హైదరాబాద్ బాలయ్య ఫ్యాన్స్ కు ఈ షో టికెట్లు దొరకడం అంటే సాహసమే. అయితే ఈ సమస్య ఆంధ్రప్రదేశ్ లో ఉండదు. అక్కడ ఉన్నది టిడిపి పాలన కాబట్టి అందులోనూ స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వియ్యంకుడి సినిమా కాబట్టి ఎలాంటి అడ్డంకులు ఉండవు.

భారీ ఎత్తున రాష్ట్రంలో అన్ని చోట్లా ప్రీమియర్ షోలకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం. అంటే ఓపెనింగ్స్ పరంగా రికార్డులు నమోదయ్యే ఛాన్స్ అక్కడే ఎక్కువగా ఉంది. సంక్రాంతి సీజన్ మొదటి సినిమా కాబట్టి థియేటర్లు కూడా ఎక్కువ దక్కనున్నాయి, పేట ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు కాబట్టి 11న వినయ విధేయ రామ వచ్చే దాకా రన్ సాఫీగా ఉంటుంది. సో ఉదయం 5 గంటల షోలకు ఫ్యాన్స్ సిద్దమవడమే ఆలస్యం