Begin typing your search above and press return to search.
'ఎన్టీఆర్' కు కట్స్ ఏమీ లేవు
By: Tupaki Desk | 4 Jan 2019 7:06 PM ISTఎన్టీ రామారావు బయోపిక్ ‘ఎన్టీఆర్’ విడుదలకు సిద్దం అయ్యింది. మరో నాలుగు రోజుల్లో అంటే ఈనెల 9వ తారీకున ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రంకు భారీ ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం సెన్సార్ బోర్డు నుండి క్లీన్ యూ సర్టిఫికెట్ ను దక్కించుకుంది. ఎలాంటి కట్స్ లేకుండానే సెన్సార్ బోర్డు వారు ఈ చిత్రం కు క్లీన్ యూ ఇచ్చినట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
మొదటి నుండి కూడా ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ చిత్రంలో ఎలాంటి వివాదాస్పద అంశాలు ఉండబోవంటూ ప్రచారం జరుగుతుంది. అందుకే కథానాయకుడు ఎలాంటి కట్స్ లేకుండానే క్లీన్ యూ దక్కించుకున్నాడు. ఫిబ్రవరిలో విడుదల కావాల్సిన ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రంకు ఇలా కట్స్ లేకుండా క్లీన్ యూ వస్తుందో చూడాలి. సెన్సార్ బోర్డు సభ్యులు ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ చిత్రంపై పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చినట్లుగా కూడా సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
బాలయ్య డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిన ఈ చిత్రంకు క్రిష్ దర్శకత్వం వహించిన విషయం తెల్సిందే. ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ చిత్రంలో ఎన్టీఆర్ సినీ జీవితానికి సంబంధించిన విశేషాలను చూపించబోతున్నారు. ఎన్టీఆర్ ఎలా సినీ రంగ ప్రవేశం చేశారు, ఎలాంటి సినిమాలు తీశారు అనే విషయాలను ఈ చిత్రంలో చూపించబోతున్నారు. ఎంతో మంది స్టార్స్ ఈ కథానాయకుడు చిత్రంలోనే కనిపించబోతున్నారు. సెన్సార్ దాటిన నేపథ్యంలో మరింత జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించేందుకు చిత్ర యూనిట్ సభ్యులు ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.