Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్: రేపే ఫస్ట్ సింగిల్!
By: Tupaki Desk | 1 Dec 2018 10:42 AM ISTనందమూరి బాలకృష్ణ - క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ రిలీజుకు సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న క్రిష్ టీమ్ ప్రమోషన్స్ విషయంలో జోరు పెంచుతున్నారు. ఈ సినిమా నుండి మొదటి పాట రిలీజుకు రంగం సిద్ధమయింది.
క్రిష్ అండ్ టీమ్ ఈ సినిమానుండి 'కథానాయక' అంటూ సాగే మొదటి సాంగ్ ను రేపు(డిసెంబర్ 2వ తారీఖు) ఉదయం 7.42 గంటలకు విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్లో బాలయ్య అచ్చతెలుగుదనం ఉట్టిపడే తెలుపు రంగు లాల్చీ ధోతీ కట్టుకుని నాన్నగారి గెటప్ లో అసెంబ్లీ ముందు విసవిసా నడుచుకుంటూ వెళ్తున్నాడు. మరి పెద్దాయనకు ఏం కోపం వచ్చిందో ఏమో. వెనక చాలామంది నిలబడి జేజేలు పలుకుతున్నారు.
ఈ సినిమాకు సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. మరి 'కథానాయకా' పాటతో అయన ఎలాంటి మ్యాజిక్ చేస్తారో వేచి చూడాలి. ఈ పాట రిలీజ్ అయితే సంక్రాంతి సినిమాల హంగామా డిసెంబర్ మొదటివారంనుండే మొదలయినట్టే.