Begin typing your search above and press return to search.

మళ్లీ రెండు మిలియన్లు కొట్టగలడా?

By:  Tupaki Desk   |   29 Jan 2016 3:51 AM GMT
మళ్లీ రెండు మిలియన్లు కొట్టగలడా?
X
నాన్నకు ప్రేమతో ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ గా నిలిచిందో చూస్తూనే ఉన్నాం. అయితే ఎంత పెద్ద హిట్ అయినా.. భీకరమైన పోటీలో రిలీజ్ చేయడం కారణంగా.. తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు పరిమితంగానే ఉన్నాయి. కొనుక్కున్న వాళ్లకు లాభాలు వచ్చినా, అవేమీ భారీ ప్రాఫిట్స్ కాదు. కానీ యూఎస్ లో మాత్రం యంగ్ టైగర్ మూవీని సర్ ప్రైజింగ్ హిట్ అనాల్సిందే.

యూఎస్ కలెక్షన్లలో టాలీవుడ్ టాప్ 3 స్టేజ్ కి నాన్నకు ప్రేమతో చేరిపోయింది. అన్నీ బాగుంటే ఫుల్ రన్ లో రెండో ప్లేస్ కి వచ్చినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. ఈ మూవీకి డైరెక్టర్ సుకుమార్ కావడంతో.. అక్కడ భారీ రేటుకే విక్రయించారు. యూఎస్ రైట్స్ ను 7 కోట్లకు అమ్మారు నిర్మాతలు. దీన్ని రాబట్టాలంటే.. ఖచ్చితంగా ఈ సినిమా 2 మిలియన్ డాలర్ల మార్క్ ను అందుకోవాల్సిందే. ఇప్పుడే డిస్ట్రిబ్యూటర్ బ్రేక్ ఈవెన్ కు రాగలుగుతాడు. నాన్నకు ప్రేమతోకు ఇది తేలికైన విషయమే. అయితే.. మరోసారి ఎన్టీఆర్ ఈ ఫీట్ సాధించగలడా అన్నదే అసలు ప్రశ్న.

ఈ మూవీ ఇచ్చిన కిక్ తో జనతా గ్యారేజ్ ను కూడా ఇంతకంటే ఎక్కువ ప్రైస్ కే విక్రయిస్తారు. అంటే ఈ సారి తన రికార్డును తానే బద్దలు కొట్టాలి ఎన్టీఆర్. కానీ ఇప్పుడు సుకుమార్ కారణంగా ఇంత కలెక్షన్స్ వచ్చాయన్నది సుస్పష్టం. మరి కొరటాల డైరక్షన్ లో తెరకెక్కే మూవీకి ఇంత మొత్తం రాబట్టడం కొంచె కష్టం కావచ్చని అంటున్నారు. అందుకే ఈ సారి తన వ్యూహాన్ని ఎన్టీఆర్ ఛేంజ్ చేయాలని భావిస్తున్నాడట. అదేంటీ అన్నది ఇప్పటికైతే ఇంకా రివీల్ చేయలేదు.