Begin typing your search above and press return to search.

మరోసారి బుల్లి తెరపై ఎన్టీఆర్‌ సందడి

By:  Tupaki Desk   |   11 Dec 2020 11:40 AM GMT
మరోసారి బుల్లి తెరపై ఎన్టీఆర్‌ సందడి
X
తెలుగు బుల్లి తెరపై ఈమద్య వరుసగా స్టార్స్‌ కనువింధు చేస్తున్నారు. ఒకప్పుడు స్టార్స్‌ బుల్లి తెరను చిన్న చూసిన సందర్బాలు ఉన్నాయి. కాని ఇప్పుడు బుల్లి తెరకు ఉన్న పాపులారిటీని.. దాని శక్తిని తెలుసుకున్న స్టార్స్ బుల్లి తెరపై కనిపించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. బాలీవుడ్‌ స్టార్స్‌ నుండి మన స్టార్స్‌ వరకు ఎంతో మంది ఇప్పటికే బుల్లి తెరపై కనిపించారు. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కూడా ఇప్పటికే బిగ్‌ బాస్‌ సీజన్‌ 1 కు హోస్టింగ్‌ చేసి ఆకట్టుకున్నాడు. మొదటి సీజన్‌ కు వచ్చిన రేటింగ్‌ అంతా ఇంతా కాదు. కొన్ని కారణాల వల్ల తదుపరి సీజన్‌ లకు ఎన్టీఆర్‌ హోస్టింగ్‌ చేయలేక పోయాడు. మళ్లీ బిగ్‌ బాస్‌ కోసం ఎన్టీఆర్‌ వస్తే బాగుంటుంది అంటూ అభిమానులు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. సమయంలో ఎన్టీఆర్‌ మరో బుల్లి తెర షో కు రెడీ అవుతున్నట్లుగా విశ్వసనీయంగా సమాచారం అందుతోంది.

మీడియా వర్గాలు మరియు సినీ వర్గాల వారి నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్‌ హోస్ట్‌ గా జెమిని ఛానెల్‌ లో ఒక షో కు రంగం సిద్దం అయ్యింది. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో భారీ సెట్టింగ్‌ ను వేయిస్తున్నారట. జెమిని టీవీలో ప్రసారం కాబోతున్న ఎన్టీఆర్‌ షో రియాల్టీ షో నా లేదా టాక్‌ షో నా అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. షో ఏదైనా కూడా జెమిని టీవీలో ఎన్టీఆర్‌ కనిపించడం మాత్రం పక్కా అంటూ మీడియా వర్గాల వారు చాలా నమ్మకంగా చెబుతున్నారు. ఎన్టీఆర్‌ ఇప్పటికే బిగ్‌ బాస్‌ తో ఆకట్టుకున్నాడు కనుక ఈసారి ఎలాంటి అనుమానం లేకుండా హోస్ట్‌ గా అదరగొట్టడం ఖాయం అంటున్నారు.

ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా చివరి దశ షూటింగ్‌ లో ఎన్టీఆర్‌ పాల్గొంటున్నాడు. ఆ వెంటనే త్రివిక్రమ్‌ దర్శకత్వంలో సినిమాకు ఇప్పటికే డేట్లు ఇచ్చాడు. అది మార్చి నుండి పట్టాలెక్కే అవకాశం ఉంది. ఇంత బిజీ షెడ్యూల్‌ లో ఎన్టీఆర్‌ బుల్లి తెరపై షో కు ఓకే చెప్పడంతో ఆయన అభిమానులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒకటి రెండు వారాల్లో జెమిని టీవీ ఎన్టీఆర్‌ షో కు సంబంధించి పూర్తి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.