Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ వస్తున్నాడు.. ట్రోలర్స్ రెడీ

By:  Tupaki Desk   |   25 July 2022 4:30 PM GMT
ఎన్టీఆర్ వస్తున్నాడు.. ట్రోలర్స్ రెడీ
X
సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ హీరోల రికార్డుల గురించే కాదు.. వాళ్ల లుక్స్ విషయంలో కూడా జరుగుతుంటాయి. ఐతే లుక్స్ పరంగా టాలీవుడ్ స్టార్ హీరోల్లో అత్యధికంగా ట్రోల్స్ ఎదుర్కొన్నది జూనియర్ ఎన్టీఆరే అంటే అతిశయోక్తి కాదు. కెరీర్ ఆరంభం నుంచి తొలి పదేళ్లు తారక్ ఎలా ఉండేవాడో తెలిసిందే.

‘రాఖీ’ సినిమా టైంకి మరీ ఎబ్బెట్టుగా తయారైంది తన లుక్. ఐతే ‘యమదొంగ’ సినిమా కోసం పట్టుబట్టి రాజమౌళి అతడి లుక్ మార్పించాడు. ఒక్కసారిగా సన్నగా, రివటలా తయారై అందరికీ పెద్ద షాకిచ్చాడు తారక్. ఐతే ఆ తర్వాత కొంచెం ఒళ్లు చేసి పర్ఫెక్ట్ షేప్‌లోకి వచ్చాడు. ఐతే మధ్య మధ్యలో సినిమాలు లేకుండా ఎక్కువ టైం ఖాళీగా గడిపితే తారక్‌లో పాత షేడ్స్ బయటికి వస్తుంటాయి. ముఖం బొద్దుగా తయారవుతుంటుంది. అలాగే జుట్టు ఎక్కువ పెంచాడంటే బాబాల తరహాలో కనిపిస్తుంటాడు. ఇలాంటి ఫొటోలు బయటికి వచ్చినపుడు యాంటీ ఫ్యాన్స్, ట్రోలర్స్ రెడీగా ఉంటారు.

ఈ మధ్య మళ్లీ తారక్ ఇలాగే యాంటీ ఫ్యాన్స్‌కు, ట్రోలర్స్‌కు టార్గెట్ అవుతున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్ల పని అయిపోయాక మూడు నెలలుగా తారక్ ఎక్కడా కనిపించడం లేదు.

కొరటాల శివతో మొదలు కావాల్సిన అతడి కొత్త సినిమా ఆలస్యం అవుతోంది. సినిమా పని మొదలవుతుందంటే.. వర్కవుట్లు చేసి, లుక్ మార్చుకుని రెడీ అవ్వాలి కానీ.. ఈ చిత్ర ప్రారంభోత్సవం విషయంలో సందిగ్ధత కొనసాగుతోంది. దీంతో తారక్ మెయింటైనెన్స్ పక్కన పెట్టేసినట్లున్నాడు.

తాజాగా ఒక అభిమానితో కలిసి తారక్ దిగిన ఫొటో సోషల్ మీడియాలోకి వచ్చింది. అందులో జుట్టు బాగా పెంచి, బొద్దుగా తయారై కనిపించాడు తారక్. ఇక అంతే ఆ లుక్ మీద ఒక రేంజిలో ట్రోలింగ్ జరుగుతోంది. ఐతే ఆ లుక్ పక్కాగా ఎప్పటిది అనే విషయంలో స్పష్టత లేదు.

కాగా తారక్ ఈ శుక్రవారం జరిగే తన అన్న కళ్యాణ్ రామ్ సినిమా ‘బింబిసార’ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు రాబోతున్నట్లు వెల్లడైంది. ఆ రోజు కోసం యాంటీ ఫ్యాన్స్, ట్రోలర్స్ రెడీగా ఉన్నారు. తారక్ ఇదే లుక్‌తో వస్తే ఇంకా ట్రోలింగ్ చేద్దామని. మరి తారక్ వాళ్లకా ఛాన్స్ ఇస్తాడా, లేక లుక్ మార్చి వాళ్లకు అవకాశం లేకుండా చేస్తాడా.. అన్నది చూడాలి.