Begin typing your search above and press return to search.

నాగ్‌ విషయం తేలిపోయింది..మరి ఎన్టీఆర్‌?

By:  Tupaki Desk   |   24 Sep 2018 4:56 AM GMT
నాగ్‌ విషయం తేలిపోయింది..మరి ఎన్టీఆర్‌?
X
తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 2 ముగింపుకు చేరుకుంది. ఫైనల్‌ వారంలోకి అడుగు పెట్టారు. ఇంట్లో ఉన్న అయిదుగురు సభ్యుల్లో ఈ వారం విజేత ఎవరు అనే విషయం తెలిపోనుంది. ఈ ఆదివారం ప్రసారం కాబోతున్న ఫైనల్‌ ఎపిసోడ్‌ లో విజేత ఎవరు అనే విషయంను ప్రకటించనున్నారు. గత కొన్ని రోజులుగా ఫైనల్‌ ఎపిసోడ్‌ కు ప్రత్యేక గెస్ట్‌ హాజరు కాబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతున్న విషయం తెల్సిందే. మొదట నాగార్జున బిగ్‌ బాస్‌ ఫైనల్‌ ఎపిసోడ్‌ లో పాల్గొని విజేతను ప్రకటించడంతో పాటు బిగ్‌ బాస్‌ టైటిల్‌ ను కూడా ఇచ్చే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత బిగ్‌ బాస్‌ సీజన్‌ 1 హోస్ట్‌ ఎన్టీఆర్‌ గెస్ట్‌ గా రాబోతున్నట్లుగా ప్రచారం జరిగింది.

మొదటి సీజన్‌ ను సూపర్‌ హిట్‌ చేసిన ఎన్టీఆర్‌ రెండవ సీజన్‌ విజేతను ప్రకటించబోతున్నట్లుగా వచ్చిన వార్తలు అందరిలో ఆసక్తిని రేకెత్తించాయి. ఈ విషయమై ఇప్పటి వరకు అధికారిక క్లారిటీ అయితే రాలేదు కాని నాగార్జున లేదా ఎన్టీఆర్‌ లలో ఎవరో ఒకరు రావడం అయితే పక్కా అంటూ అంతా అనుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ‘దేవదాస్‌’ ప్రమోషన్స్‌ కోసం నాగార్జున బిగ్‌ బాస్‌ స్టేజ్‌ పైకి వచ్చేశాడు. నిన్నటి ఎపిసోడ్‌ లో కొన్ని నిమిషాల పాటు నాగార్జున ఇలా వచ్చి అలా వెళ్లి పోయాడు. దీంతో నాగార్జున ఫైనల్‌ ఎపిసోడ్‌ కు రాకపోవచ్చు అని తేలిపోయింది.

నాగార్జున విషయంపై క్లారిటీ రాగా ప్రస్తుతం అందరి దృష్టి ఎన్టీఆర్‌ పై ఉంది. అరవింద సమేత చిత్రం షూటింగ్‌ నిమిత్తం ప్రస్తుతం ఎన్టీఆర్‌ విదేశాల్లో ఉన్నాడు. మరో రెండు మూడు రోజుల్లోనే టీం మొత్తం చిత్రీకరణ పూర్తి చేసుకుని రాబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. అంటే ఫైనల్‌ ఎపిసోడ్‌ టైం కు ఎన్టీఆర్‌ హైదరాబాద్‌ లోనే ఉండే అవకాశం ఉంది అంటూ సినీ వర్గాల నుండి సమాచారం అందుతుంది. మరి ఎన్టీఆర్‌ బిగ్‌ బాస్‌ సీజన్‌ 2 విజేతను ప్రకటించేందుకు వస్తాడా అనేది అందరిలో చర్చనీయాంశం అవుతుంది. అయితే కొందరు మాత్రం ఎన్టీఆర్‌ కుటుంబంలో జరిగిన విషాదం కారణంగా ఆయన రాకపోవచ్చు అంటున్నారు. ఎన్టీఆర్‌ వస్తే మాత్రం బిగ్‌ బాస్‌ సీజన్‌ 2 కూడా సూపర్‌ హిట్‌ అయినట్లే అంటూ నందమూరి అభిమానులు అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో..!