Begin typing your search above and press return to search.
వచ్చే ఏడాది ప్రభాస్ మాదిరిగా ఎన్టీఆర్...!
By: Tupaki Desk | 2 Jun 2023 6:00 AMయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఆదిపురుష్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు రెడీగా ఉన్న విషయం తెల్సిందే. ఇదే నెలలో ఆదిపురుష్ సినిమా విడుదల అవ్వబోతుంది. మరో వైపు సలార్ ను కూడా ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నాడు.
ఇక మారుతి దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తూనే మరో వైపు ప్రాజెక్ట్ కే షూటింగ్ లో కూడా ప్రభాస్ పాల్గొంటున్నాడు. ఒకే సమయంలో రెండు మూడు సినిమాల షూటింగ్స్ ను సమాంతరంగా తీసుకు వెళ్లడం ఈ మధ్య కాలంలో కేవలం ప్రభాస్ కు మాత్రమే చెల్లింది.
వచ్చే ఏడాది ప్రభాస్ మాదిరిగా ఎన్టీఆర్ కూడా ఒకే సారి రెండు సినిమాలను చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు సెప్టెంబర్ లేదా అక్టోబర్ వరకు పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి.
మరో వైపు ఎన్టీఆర్ హిందీ వార్ 2 సినిమాకు ఓకే చెప్పాడు. అంతే కాకుండా వచ్చే ఏడాది లో కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమాను చేయబోతున్నాడు. వచ్చే ఏడాది వార్ 2 మరియు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమాలను సమాంతరంగా చేయాలని నిర్ణయించుకున్నాడట.
2024 లో ఆ రెండు సినిమాలతో ఎన్టీఆర్ బిజీ బిజీగా ఉండబోతున్నాడు. ఆ రెండు సినిమాలను కూడా మూడు నాలుగు నెలల గ్యాప్ లోనే 2025 సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా ఎన్టీఆర్ ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ కుటుంబంతో కలిసి విదేశీ యాత్రకు వెళ్లాడు. రాగానే దేవర సినిమా యొక్క షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు.