Begin typing your search above and press return to search.

కీరవాణి కొడుకును పరిచయం చేసిన ఎన్టీఆర్‌

By:  Tupaki Desk   |   23 Oct 2019 7:20 AM GMT
కీరవాణి కొడుకును పరిచయం చేసిన ఎన్టీఆర్‌
X
ఎంఎం కీరవాణి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు సినిమా పరిశ్రమకు ఎన్నో అద్బుతమైన మ్యూజిక్‌ ఆల్బమ్స్‌ ఇచ్చిన గొప్ప సంగీత దర్శకుడు. రాజమౌళి ప్రతి సినిమాకు కూడా కీరవాణి సంగీతం అందిస్తూ ఉంటాడు. జక్కన్న సూపర్‌ బ్లాక్‌ బస్టర్స్‌ లో కీరవాణి ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంటారు. అలాంటి కీరవాణి చిన్నబ్బాయి కోడూరి సింహా హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నాడు. భైరి సంగీత దర్శకత్వంలో తెరకెక్కిన 'మత్తు వదలరా' చిత్రంతో సిహా హీరోగా పరిచయం అవ్వబోతున్నాడు.

ఎన్టీఆర్‌ ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ ను విడుదల చేశాడు. ట్విట్టర్‌ లో 'మత్తు వదలరా' చిత్రం ఫస్ట్‌ లుక్‌ ను పోస్ట్‌ చేసిన ఎన్టీఆర్‌ కాలం గడిచి పోతుంది, నా సోదరులు అంతా కూడా పెద్ద వారు అవుతున్నారు. సింహా హీరోగా నటించిన ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ ను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందని.. ఈ సినిమాతో మంచి సక్సెస్‌ అందుకోవాలంటూ చిత్ర యూనిట్‌ సభ్యులందరికి కూడా ఎన్టీఆర్‌ ఆల్‌ ది బెస్ట్‌ చెప్పాడు. ఫస్ట్ లుక్ చాలా విభిన్నంగా ఉంది. సింహా కొన్ని పేపర్ కట్టింగ్స్ పై డీప్ స్లీప్ లో ఉన్నాడు. పేపర్ కట్టింగ్స్ కాస్త సరదాగా ఉన్నాయి. కనుక అంతా ఫస్ట్ లుక్ కు ఫిదా అవుతున్నారు.

విభిన్నమైన కాన్సెప్ట్‌ తో రితేష్ రానా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్‌ వారు క్లాప్‌ ఎంటర్‌ టైన్‌ మెంట్‌ బ్యానర్‌ తో కలిసి నిర్మిస్తున్న కారణంగా అంచనాలు భారీగా ఉన్నాయి. జక్కన్న ఫ్యామిలీ నుండి వస్తున్న హీరో కనుక సింహాపై సినీ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. మరి సింహా ఆ అంచనాలను ఏ మేరకు అందుకుంటాడో చూడాలి. ఎన్టీఆర్‌ ఫస్ట్‌ లుక్‌ విడుదల చేయడంతో అందరిలో ఆసక్తి మొదలైంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు అతి త్వరలో వెళ్లడి కానున్నాయట.