Begin typing your search above and press return to search.
పెద్దాయన డైలాగ్.. ఎన్టీఆర్ ను గెలిపించింది
By: Tupaki Desk | 18 Jan 2016 12:04 PM ISTప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అంటే ఇదే కాబోలు. తన తాతయ్య డైలాగ్ ఆధారంగా ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోలో ఓ ప్రశ్నకు జవాబు చెప్పగలిగాడు ఎన్టీఆర్. ఆ జవాబు వల్ల అతను రూ.3.2 లక్షల నుంచి రూ.6.5 లక్షలకు చేరుకున్నాడు. ఇంతకీ ఆ ప్రశ్న ఏంటి.. ఎన్టీఆర్ గుర్తు చేసుకున్న డైలాగ్ ఏంటి.. చూద్దాం పదండి.
‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోలో ఎన్టీఆర్ రూ.12.5 లక్షలు గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఐతే రూ.3.2 లక్షలు గెలిచాక నాగ్.. తర్వాతి ప్రశ్నగా ‘ద్రోణాచార్యుడి తండ్రి ఎవరు’ అని అడిగాడు. దీనికి నాలుగు ఆప్షన్లు ఇచ్చాడు. ఐతే ఎన్టీఆర్ కాసేపు ఆలోచించి భరద్వాజుడు అని బదులిచ్చాడు. చివరికి అదే కరెక్ట్ ఆన్సర్ అని తేలింది. ఇంతకీ ఈ జవాబు ఎలా ఇచ్చావు అని అడిగితే.. ఎన్టీఆర్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు.
‘దాన వీర శూర కర్ణ’లో ఎన్టీఆర్ కులం గురించి చెప్పిన ఫేమస్ డైలాగ్ లో భాగంగా ‘నీ తండ్రి భరద్వాజుడి జననమెట్టిది’ అంటూ ద్రోణాచార్యుడిని ప్రశ్నిస్తాడు. ఈ డైలాగ్ గుర్తు తెచ్చుకుని తాను ఈ ప్రశ్నకు జవాబిచ్చినట్లు వెల్లడించాడు ఎన్టీఆర్. తారక్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ సూపర్బ్ అంటూ నాగ్ కితాబిచ్చాడు. మొత్తానికి తాతయ్య సినిమాలు బాగా చూడ్డం వల్ల, ఆయన డైలాగులు గుర్తు పెట్టుకోవడం వల్ల ఎన్టీఆర్ ఎంత లాభపడ్డాడో చూశారా?