Begin typing your search above and press return to search.
ట్విట్టర్ లో అరుదైన రికార్డ్ సాధించిన ఎన్టీఆర్...!
By: Tupaki Desk | 14 May 2020 5:30 PM ISTయంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నందమూరి నటవారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి నూనూగు మీసాల వయసులోనే ఎన్నో రికార్డ్స్ తిరగ రాశారు. ప్రస్తుతం తారక్ వరుస సినిమాలలో నటిస్తూ వరుస సక్సెస్ లను అందుకుంటున్నాడు. ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ ఖాతాలోకి మరో అరుదైన రికార్డ్ వచ్చి చేరింది. సోషల్ మీడియాలో కూడా నందమూరి తారక రామారావు స్టామినా ఏంటో చూపించింది. వివరాల్లోకి వెళ్తే ఎన్టీఆర్ సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ లో 2009లో అడుగుపెట్టాడు. ఇప్పుడు ట్విట్టర్ లో తారక్ ని ఫాలో అవుతున్న వారి సంఖ్య 4 మిలియన్లకి చేరింది. ఇప్పటి వరకు ట్విట్టర్ ఫాలోవర్స్ ఎక్కువగా ఉన్న టాలీవుడ్ మేల్ సెలబ్రిటీలలో నాల్గవ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక ఎన్టీఆర్ ట్విట్టర్ ఫాలోవర్స్ 40 లక్షల మంది అయితే.. ఆయన ఫాలో అయ్యేది కేవలం దర్శకధీరుడు రాజమౌళిని మాత్రమే.
టాలీవుడ్ మేల్ సెలబ్రిటీలలో అత్యధికంగా ట్విట్టర్ ఫాలోవర్స్ తో సూపర్ స్టార్ మహేష్ బాబు టాప్ పొజిషన్ లో ఉన్నారు. మహేష్ బాబుని ట్విట్టర్ లో 9.6 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఆ తర్వాత టాలీవుడ్ కింగ్ నాగార్జున మరియు దగ్గుబాటి రానా లకు 5.9 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అల్లు అర్జున్ ని 4.5 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు. ఇకపోతే జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 4 మిలియన్ ఫాలోవర్స్ కి దగ్గరగా ఉన్నారు. పవన్ కి ప్రస్తుతం 3.9 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఈ మధ్యే సోషల్ మీడియా ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు ఇంకా వన్ మిలియన్ ఫాలోవర్స్ కి చేరుకోలేదు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇంకా ట్విట్టర్ లో అడుగు పెట్టలేదు. కానీ ఇంస్టాగ్రామ్ లో మాత్రం అకౌంట్ మైంటైన్ చేస్తున్నాడు.