Begin typing your search above and press return to search.
త్రివివిక్రమ్ స్టైలేంటో ఎన్టీఆర్ కు అర్థమైంది
By: Tupaki Desk | 8 Jun 2018 8:00 PM ISTతనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని.. భారీ విజయాలు అందుకున్న దర్శకుడితో పని చేయాలని ప్రతి హీరో కూడా అనుకుంటాడు. అలా తెలుగు హీరోలు కోరుకునే దర్శకుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. ‘అతడు’ తర్వాతి నుంచి త్రివిక్రమ్ తో పని చేయాలని చాలామంది స్టార్లు ఆశిస్తున్నారు. ఐతే ఆయన మాత్రం మార్చి మార్చి మహేష్.. పవన్ కళ్యాణ్.. అల్లు అర్జున్ లతోనే సినిమాలు తీశాడు. మిగతా స్టార్లకు అందుబాటులోకి రాలేదు. త్రివిక్రమ్ తో పని చేయాలని బాగా కోరుకున్న వాళ్లలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకడు. ఎట్టకేలకు గత ఏడాది వీళ్ల కాంబినేషన్ ఓకే అయింది. ఈ ఏడాది సినిమా పట్టాలెక్కింది. త్రివిక్రమ్ నుంచి ‘అజ్ఞాతవాసి’ లాంటి డిజాస్టర్ తర్వాత రాంగ్ టైమింగ్ లో ఈ సినిమా పట్టాలెక్కడం అభిమానుల్ని ఒకింత నిరాశకు గురి చేసినా.. త్రివిక్రమ్ తో పని చేస్తుండటం పట్ల ఎన్టీఆర్ మాత్రం చాలా ఎగ్జైటెడ్ గానే ఉన్నాడంటారు సన్నిహితులు.
పీక్ సమ్మర్లో ఈ చిత్ర షూటింగ్ మొదలు పెట్టిన త్రివిక్రమ్.. వేసవి చివరికొచ్చేసరికి తొలి షెడ్యూల్ పూర్తి చేశాడు. ఈ షెడ్యూల్లో ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ సహా కీలకమైన సన్నివేశాలే చిత్రీకరించారట. ఎన్టీఆర్-పూజా హెగ్డే కాంబినేషన్లో కొన్ని రొమాంటిక్ సీన్లు కూడా తీశాడు. ఒక తరహా అని కాకుండా తొలి షెడ్యూల్లో విభిన్నమైన సీన్లు తీశాడట త్రివిక్రమ్. వివిధ రకాల సన్నివేశాలు తీయడంలో తన స్టైలేంటో ఎన్టీఆర్ కు తెలిసేలా చేయడానికే త్రివిక్రమ్ ఇలా చేసినట్లు సమాచారం. ఇప్పటికే చాలామంది స్టార్ డైరెక్టర్లతో పని చేసిన ఎన్టీఆర్ కు.. త్రివిక్రమ్ వర్కింగ్ స్టైల్ చాలా నచ్చిందని.. ఆయన చాలా కూల్ గా సీన్లు డీల్ చేసిన విధానం మెప్పించిందని.. ఔట్ పుట్ విషయంలోనూ పాజిటివ్ గానే స్పందించాడని అంటున్నారు చిత్ర యూనిట్ సభ్యులు. షెడ్యూల్ చివర్లో ఎన్టీఆర్ షూటింగుకి దూరంగా ఉండగా.. పూజా మీద కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాడు త్రివిక్రమ్. ఈ సందర్భంగా త్రివిక్రమ్.. సినిమాటోగ్రాఫర్ పి.ఎస్.వినోద్ లతో కలిసి ఒక సెల్ఫీ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. తొలి షెడ్యూల్ పూర్తయిందని ప్రకటించింది పూజా. త్వరలోనే రెండో షెడ్యూల్ మొదలు కానుంది.