Begin typing your search above and press return to search.
నచ్చి మెచ్చిన తర్వాతే చేస్తున్న ఎన్టీఆర్
By: Tupaki Desk | 22 March 2018 9:58 AM ISTఎన్టీఆర్ మూవీ జైలవకుశ థియేటర్లలోకి వచ్చి ఐదు నెలలు గడిచిపోయింది. తమ అభిమాన హీరో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆలోచించడం తర్వాత సంగతి.. ఎప్పుడు మొదలవుతుందా అని యంగ్ టైగర్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మూవీ ఖాయమై చాలాకాలమే అయింది.
కానీ అజ్ఞాతవాసి డిజాస్టర్ తర్వాత తన స్క్రిప్ట్ పై రీవర్క్ చేసుకునేందుకు 2 నెలల సమయం తీసుకున్నాడు త్రివిక్రమ్. మరోవైవు ఈ సమయంలో ఎన్టీఆర్ కూడా బాగా తగ్గాడు. వర్కవుట్స్ తో బరువు తగ్గించుకుని బాగా మారిపోయాడు. మరి కొన్ని రోజుల్లోనే సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది కూడా. అయితే.. ఇప్పుడీ సినిమాను స్టార్ట్ చేసేయడం వెనక.. ఆ తర్వాత రాజమౌళి మూవీ చేయడం కారణంగా ప్రచారం జరుగుతోంది. త్రివిక్రమ్ మళ్లీ రాసిన స్క్రిప్ట్ కూడా ఎన్టీఆర్ కు అంతగా రుచించలేదని వాటి సారాంశం. అయితే.. ఇందులో ఎంతమాత్రం వాస్తవం లేదని తెలుస్తోంది.
టెంపర్ నుంచి తన స్క్రిప్ట్ లను పక్కాగా చూసుకుంటున్న ఎన్టీఆర్.. ఎట్టిపరిస్థితుల్లోనూ ఫైనల్ డ్రాఫ్ట్ చదవకుండా.. అది నచ్చకుండా సినిమాను మొదలుపెట్టడం లేదు. మొత్తం కథ కథనం తాను ఆకళింపు చేసిన తర్వాతే.. సినిమాను మొదలుపెడుతున్నాడు. అందుకే ఒక్కోసారి లేటవుతోంది కూడా. పైగా తాను ఎంతగానో గౌరవించే త్రివిక్రమ్.. తిరిగి రాసిన వెర్షన్ ఎన్టీఆర్ కు విపరీతంగా నచ్చేసిందట. ఇప్పటికే పలుమార్లు టాప్ టు బాటమ్ మొత్తం తిరగేసేశాడని తెలుస్తోంది.