Begin typing your search above and press return to search.

త్రివిక్రమ్ పై ఎన్టీఆర్ క్లారిటీ ఇదే!!

By:  Tupaki Desk   |   31 Jan 2018 10:19 AM IST
త్రివిక్రమ్ పై ఎన్టీఆర్ క్లారిటీ ఇదే!!
X
జై లవకుశతో మంచి సక్సెస్ సాధించిన జూనియర్ ఎన్టీఆర్.. నాలుగు నెలలుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇప్పటివరకూ పూజా కార్యక్రమాలు మాత్రమే పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. మరికొన్ని వారాల్లో షూటింగ్ ప్రారంభించుకోనుంది.

అయితే.. పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి చిత్రం భారీ పరాజయం తర్వాత.. త్రివిక్రమ్ ను చాలామందే బ్లేమ్ చేస్తున్నారు. ఈ ఎఫెక్ట్ యంగ్ టైగర్ సినిమాపై కూడా ఉంటోందని అంటున్నారు. పైగా ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో ఎన్టీఆర్ తన అసంతృప్తి వెళ్లగక్కాడని.. పలు కీలకమైన మార్పులను సూచించాడని.. అంటే స్క్రిప్ట్ విషయంలో జోక్యం చేసుకుంటున్నాడని మాటలు వినిపిస్తున్నాయి. అయితే.. వీటన్నిటికీ ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చేశాడని తెలుస్తోంది.. ఈ మధ్య కాలంలో ఎప్పుడూ ఎన్టీఆర్ బయట కనిపించలేదు కానీ.. తన సన్నిహితుల దగ్గర మాత్రం.. బయట వినిపించే రూమర్స్ కు క్లారిటీ ఇచ్చాడట. స్క్రిప్ట్ విషయంలో తన ప్రమేయం ఉండదని.. త్రివిక్రమ్ కు తాను ఒక్క మాట కూడా చెప్పలేదని అన్నాడట ఎన్టీఆర్.

అంతే కాదు.. ఫ్యామిలీ డ్రామా కోసం లైపో చేయించుకునేందుకు ఎన్టీఆర్ రెడీ అవుతున్నాడన్న న్యూస్ కూడా అభిమానులను కలవరపెట్టింది. దీనిపై కూడా వివరణ ఇచ్చాడట ఈ స్టార్ హీరో. తాను ఎక్సర్ సైజ్ లు.. డైట్ కంట్రోల్ ద్వారానే లావు తగ్గుతానని.. అంతే తప్ప వేరే ఇతర పద్ధతులను ఎట్టి పరిస్థితుల్లోను ట్రై చేయనని తేల్చేశాడట మన యంగ్ టైగర్.