Begin typing your search above and press return to search.
మహేష్, ప్రభాస్ నడిచిన బాటలో ఎన్టీఆర్
By: Tupaki Desk | 20 March 2020 5:20 PM ISTసినీ పరిశ్రమ అంటేనే కొన్ని కోట్ల బిజినెస్ కి సంబంధించింది. ఏ పరిశ్రమలో అయినా వారి అంతిమ లక్ష్యం నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనుకోవడమే. ఇందుకు చిత్ర పరిశ్రమ కూడా అతీతం కాదు. సినీ ఇండస్ట్రీలో నిర్మాతలుగా మారిన హీరోలున్నారు, హీరోయిన్లు ఉన్నారు, దర్శకులు ఉన్నారు, కమెడియన్స్ ఉన్నారు, అంతెందుకు చిన్నా చితకా క్యారెక్టర్స్ చేసే ఆర్టిస్టులు కూడా ఉన్నారు. అలాగే మన తెలుగు ఇండస్ట్రీలో కూడా స్టార్ హీరోలు తమ పంథా మార్చుకుంటున్నారు. వాళ్ళు నటించే ప్రతి సినిమా నిర్మాణంలో భాగస్వాములు కావాలని అనుకుంటున్నారు. స్టార్ హీరోల సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉన్న నేపథ్యంలో టాక్ తో సంబంధం లేకుండా మినిమమ్ వసూళ్లు వస్తుంటాయి. అలాగే పెట్టుబడికి లాభం కలుపుకొని సినిమా నిర్మాతలు అమ్మేసుకుంటారు. ఇక డిజిటల్ మరియు శాటిలైట్ రైట్స్ ఉండనే ఉన్నాయి. స్టార్ హీరోతో సినిమా అంటే లాభాలు గ్యారంటీ అనే పరిస్థితి నెలకొని ఉంది. ఈ అడ్వాంటేజ్ ని స్టార్ హీరోలు సైతం క్యాష్ చేసుకుంటున్నారు. వారు కూడా సినిమా నిర్మాణంలో భాగస్వాములుగా ఉంటున్నారు. ఒకప్పుడు అక్కినేని నాగార్జున తాను నటించే ప్రతి సినిమాలో భాగస్వామిగా ఉంటూ చిత్ర లాభ నష్టాలలో పాలుపంచుకుంటూ ఉంటారు. ఈ విషయంలో కింగ్ నాగార్జున సక్సెస్ అయ్యాడనే చెప్పుకోవచ్చు. తర్వాతి రోజుల్లో మహేష్, ప్రభాస్ వంటి హీరోలు ఈ పద్ధతినే ఫాలో అయ్యారు.
ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ కూడా వీళ్ళ దారిలోనే నడుస్తున్నాడు. తన తదుపరి చిత్రం నుండి చిత్ర నిర్మాణంలో భాగస్వామి అవ్వాలనుకుంటున్నాడట. ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ తెరకెక్కిస్తుండగా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మిస్తున్నాయి. ఎన్టీఆర్ ఆర్ట్స్ కళ్యాణ్ రామ్ ది అయినప్పటికీ ఎన్టీఆర్ కూడా ఈసారి వాటా తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక భవిష్యత్తులో ఓ నిర్మాణ సంస్థను స్థాపించే ఆలోచనలో ఉన్న ఆయన ఇకపై తాను నటించే ప్రతి సినిమా నిర్మాణ భాగస్వామిగా ఉండాలని నిర్ణయించుకున్నారట. వరుస విజయాలతో దూకుడు మీదున్న ఎన్టీఆర్ దీంట్లో కూడా సక్సెస్ అవుతాడో లేదో చూడాలి.