Begin typing your search above and press return to search.

ర‌కూల్‌.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ హ‌ర్టయ్యారు

By:  Tupaki Desk   |   25 Oct 2015 11:30 AM GMT
ర‌కూల్‌.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ హ‌ర్టయ్యారు
X
ఐరెన్‌ లెగ్ టు గోల్డెన్‌ లెగ్ అనిపించుకున్న హీరోయిన్లు మ‌న‌కు ఉన్నారు. శ్రుతిహాస‌న్ కెరీర్ ఆరంభం ఐరెన్ లెగ్ అన్న ముద్ర వేయించుకుంది.అయితే చాలా త‌క్కువ టైమ్‌ లోనే ఆ అప‌వాదు తొల‌గించుకుని గోల్డెన్ లెగ్ అన్న పేరు తెచ్చుకుంది. అయితే ఇందుకు పూర్తి రివ‌ర్సులో పాపుల‌ర్ అవుతోంది ర‌కూల్ ప్రీత్‌ సింగ్‌. ఈ అమ్మ‌డు వెంక‌టాద్రి ఎక్స్‌ ప్రెస్‌ - లౌక్యం సినిమాల‌తో విజ‌యాలు అందుకున్న‌ప్పుడు గోల్డెన్ లెగ్ అంటూ పొగిడేసిన ఇండ‌స్ర్టీ ఇప్పుడు కిక్‌2 - బ్రూస్ లీ సినిమాల‌తో ఫ్లాపులు అందుకోగానే ఐరెన్ లెగ్ అన్న ముద్ర ప‌డిపోయింది. అయితే ఈ పిలుపు నంద‌మూరి అభిమానుల‌కు పెద్ద సంక‌టంగా మారింది.

ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానులు ర‌కూల్ విష‌యంలో చాలా ఇదై పోతున్నారని స‌మాచారం. వ‌రుస‌గా రెండు ఫ్లాపులిచ్చిన ర‌కూల్ ఇప్పుడు ఎన్టీఆర్ స‌ర‌స‌న నాన్న‌కు ప్రేమ‌తో చిత్రంలో న‌టిస్తోంది. ర‌కూల్ న‌టించిన కిక్‌2 అట్ట‌ర్ ఫ్లాప్‌. బ్రూస్‌ లీ సేమ్ రిజ‌ల్ట్‌ ని రిపీట్ చేసింది. కాబ‌ట్టి ఇది శుభ‌శ‌కున‌మేనా? అన్న సందేహాల్ని వ్య‌క్తం చేస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌. అయితే సుకుమార్ లాంటి జీనియస్ డైరెక్ట‌ర్ కాబ‌ట్టి ర‌కూల్‌ కి ఆ అప‌వాదు తొల‌గిపోతుంద‌నే అనుకుందాం. నాన్న‌కు ప్రేమ‌తో చిత్రం హిట్ కొడితే ర‌కూల్ పై ప‌డిన ఆ ముద్ర తొల‌గిపోతుంది. లేదంటే ఆ బిరుదునే ఫిక్స‌యిపోతారంతా.