Begin typing your search above and press return to search.

20 మిలియన్ల దిశగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ట్వీట్ల పండుగ!

By:  Tupaki Desk   |   20 May 2020 2:00 PM GMT
20 మిలియన్ల దిశగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ట్వీట్ల పండుగ!
X
యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజును ఆయన అభిమానులు ట్విట్టర్ వేదికగా పెద్ద పండుగ వాతావరణం క్రియేట్ చేస్తున్నారు. ఇంతవరకు ఇండియాలో ఏ హీరో ఫ్యాన్స్ చేరుకొని ట్వీట్ల సంఖ్యతో దుమ్మురేపుతున్నారు. ఎంత ఫాలోయింగ్ ఉన్నప్పటికీ తనకంటే సీనియర్ హీరోలు సాధించలేని రికార్డులను బద్దలు కొడుతున్నాడు ఎన్టీఆర్. ఇంతవరకు హ్యాపీ బర్త్ డే పవన్ కళ్యాణ్ (#HappyBirthdayPawanKalyan) హాష్ ట్యాగ్ మాత్రమే టాప్‌ స్థానంలో నిలిచింది. కానీ దాన్ని బ్రేక్ చేస్తూ దేశంలో ఏ హీరోకు దక్కని విధంగా బర్త్ డే హ్యాష్ ట్యాగ్ రికార్డు ట్వీట్లు సాధించింది. పవన్ కళ్యాణ్ బర్త్ డే రోజున 10.51 మిలియన్ల ట్వీట్‌ సాధించి దేశంలోనే టాప్ హీరోగా పవన్ కళ్యాణ్ నిలిచింది.

ఈ రికార్డును నేడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చెరిపేసారు. తాజాగా హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్ హాష్ ట్యాగ్ ఇతర హీరోల బర్త్ డే హ్యాష్ ట్యాగ్‌ రికార్డులను మే 20వ తేదీ ఉదయం వరకు 13.5 మిలియన్ల ట్వీట్లకు పైగా సాధించి బ్రేక్ చేసింది. ప్రస్తుతం ఎన్టీఆర్ హాష్ ట్యాగ్ మాత్రమే టాప్ స్థానంలోకి చేరిందని.. ఇదే ఇప్పటివరకు బర్త్ డే హ్యాష్ ట్యాగ్స్ లో నంబర్ వన్ అని ప్రూవ్ చేశారు. ఇక ప్రస్తుతం.. ఎన్టీఆర్ అభిమానుల జోరు చూస్తే 24గంటలు గడవక ముందే 20 మిలియన్ల ట్వీట్లను సాధించేలా దూసుకెళ్తున్నారు. ఇక అదే గనక జరిగితే దేశవ్యాప్తంగా ఇదే ట్రెండింగ్‌ అవుతుంది. ప్రస్తుతం హ్యాష్ ట్యాగ్ల ట్రెండింగ్ నడుస్తుంది. ఏ హీరో ఫ్యాన్స్ అయినా ఈ ట్వీట్ల రికార్డు బ్రేక్ చేయడానికే ట్రై చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ హాష్ ట్యాగ్ ని ఎవరు కదిలించేలా కనిపించడం లేదు. చూడాలి డే ఎండింగ్ లోపు ఎన్ని మిలియన్లు నమోదు చేస్తుందో..!