Begin typing your search above and press return to search.

స్టార్ డైరెక్ట‌ర్ కి అండ‌గా ఎన్టీఆర్ ఫ్యాన్స్‌

By:  Tupaki Desk   |   16 Jun 2022 10:30 AM GMT
స్టార్ డైరెక్ట‌ర్ కి అండ‌గా ఎన్టీఆర్ ఫ్యాన్స్‌
X
కొంత మంది డైరెక్ట‌ర్ల‌కు ఎంత ట్రాక్ రికార్డ్ వున్నా కాలం క‌లిసి రాక‌పోతే ఆ ట్రాక్ రికార్డ్ కూడా ప‌ని చేయదు..అనుకున్న క‌థ ఆడియ‌న్స్ ని ఎంగేజ్ చేయ‌లేక‌పోతే ఎంత ట్రాక్ రికార్డ్ వున్న డైరెక్ట‌ర్ కైనా ఫ్లాప్ త‌ప్పదు. ఇక్క‌డ ట్రాక్ రికార్డ్ ల కంటే కంటెంట్ కే విలువ ఎక్కువ‌. ఇదే విష‌యం 'ఆచార్య‌' ఫ‌లితంలో మ‌రోసారి రుజువైంది. స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కున్న ట్రాక్ రికార్డ్ గురించి తెలిసిందే. కెరీర్ ప్రారంభం నుంచి అప‌జ‌య‌మెరుగని డైరెక్ట‌ర్ గా ఆయ‌న రికార్డు సాధించారు.

అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవితో ఆయ‌న చేసిన 'ఆచార్య‌' బాక్సాఫీస్ వ‌ద్ద భారీ ఫ్లాప్ గా నిలిచి ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌కు చేదు అనుభ‌వాన్ని మిగ‌ల్చింది. ఈ మూవీ అందించిన ఫ‌లితంతో ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. మెగా ఫ్యాన్స్ చాలా వ‌ర‌కు ట్రోల్ చేశారు కూడా. ఫ్లాప్ ని ఎదుర్కొన్న డైరెక్ట‌ర్ తో వెంట‌నే మరో స్టార్ హీరో సినిమా చేయ‌డానికి పెద్ద‌గా ఆస‌క్తిని చూపించ‌రు.. అంగీక‌రించిన ప్రాజెక్ట్ ని కూడా ఒక్కో సంద‌ర్భంలో ప‌క్క‌న పెట్టేస్తుంటారు.

కానీ కొర‌టాల శివ టాలెంట్ ఏంటో తెలిసిన యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఆయ‌న‌పై వున్న న‌మ్మ‌కంతో ప్ర‌స్తుతం త‌న 30 వ సినిమాని చేస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో యువ‌సుధా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై సుధాక‌ర్ మిక్కిలినేని నిర్మిస్తున్నారు.

ఈ ప్రాజెక్ట్ విష‌యంలో డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌కు హీరో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ స‌పోర్ట్ గా నిలుస్తుండ‌టం విశేషం. ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ పుట్టిన‌రోజు వేడుక బుధ‌వారం జ‌రిగింది.

ఈ నేప‌థ్యంలో ద‌ర్శ‌కుడు కొర‌టాల పై మెగా ఫ్యాన్స్ కొంత మంది అనుచిత వ్యాఖ్య‌లు చేస్తూ నెట్టింట పోస్ట్ లు పెట్టార‌ట‌. దీనికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ధీటుగా స‌మాధానం చెప్ప‌డ‌మే కాకుండా మీ మీద వస్తున్న విమ‌ర్శ‌ల‌కు లెఫ్ట్.., రైట్‌ అండ్ సెంట‌ర్ లో రికార్డ్స్ ని బ్రేక్ చేసి ధీటుగా స‌మాధానం చెప్పండ‌ని ద‌ర్శ‌కుడిని రిక్వెస్ట్ చేయ‌డం నెట్టింట వైర‌ల్ గా మారింది. అందే కాకుండా ఎన్టీఆర్ తో చేయ‌బోతున్న సినిమాని కొర‌టాల శివ ఏ రేంజ్ లో తెర‌పైకి తీసుకొస్తార‌ని గ‌ట్టిగా న‌మ్ముతున్నార‌ట ఎన్టీఆర్ ఫ్యాన్స్‌.

మే 20న జ‌రిగిన ఎన్టీఆర్ పుట్టిన రోజున ఈ మూవీకి సంబంధించిన డైలాగ్ మోష‌న్ టీజ‌ర్ ని విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. ఐదు భాష‌ల్లో పాన్ ఇండియా రేంజ్ లో అద‌ర‌గొట్ట‌డానికి వ‌స్తున్నామంటూ సంకేతాలు అందించిన కొర‌టాల శివ మోష‌న్ టీజ‌ర్ తో త‌నపై వున్న నెగిటివిటిని పోగొట్టి పాజిటివ్ వైబ్స్ ని క్రియేట్ చేసుకున్న విష‌యం తెలిసిందే. త్వ‌ర‌లోనే ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. పాన్ ఇండియా బ్లాక్ బ‌స్ట‌ర్ ని అందించాల‌నే క‌సితో పని చేస్తున్న కొర‌టాల శివ అంచ‌నాల‌ని ఈ మూవీ ఏ స్థాయిలో నెర‌వేరుస్తుందో తెలియాలంటే మ‌రి కొన్ని నెల‌లు వేచి చూడాల్సిందే.