Begin typing your search above and press return to search.

ఫొటో స్టోరీ: ఎన్టీఆర్ కాళ్లపై ప‌డ్డారు

By:  Tupaki Desk   |   2 Jun 2016 1:10 PM GMT
ఫొటో స్టోరీ: ఎన్టీఆర్ కాళ్లపై ప‌డ్డారు
X
మాస్‌ లో ఆకాశ‌మే హ‌ద్దుగా క్రేజ్ సంపాదించుకొన్న యువ హీరో ఎన్టీఆర్‌. ఒక్క తెలుగులోనే అని కాదు... జ‌పాన్ వ‌ర‌కు ఎన్టీఆర్ అన్న పేరు మార్మోగిపోతోంది. ప‌క్క భాష‌ల్లో ఆయ‌న సినిమాలు అనువాద‌మ‌య్యేది త‌క్కువే. అయినా స‌రే... అక్క‌డ కూడా భారీస్థాయిలో అభిమానుల్ని సంపాదించుకొన్నాడు తార‌క్‌. తాతగారైన ఎన్టీఆర్‌ ని ఈ జూనియ‌ర్‌ లో చూసుకొంటుంటారు అభిమానులు. అందుకే తార‌క్ ఎక్క‌డికెళ్లినా చుట్టూ అభిమానులు గుమికూడుతుంటారు. ఆమ‌ద్య నాన్న‌కు ప్రేమ‌తో షూటింగ్ కోసం లండ‌న్‌ కి వెళ్లిన ఎన్టీఆర్‌ కి అక్క‌డ కూడా అభిమానుల తాకిడి త‌ప్ప‌లేదు.

తాజాగా జ‌న‌తా గ్యారేజ్ కోసం ఆయ‌న చెన్నైలో గ‌డుపుతున్నారాయ‌న‌. అక్క‌డ కూడా సెట్‌ కి జ‌నం తండోప‌తండాలుగా త‌ర‌లి వ‌స్తున్నార‌ట‌. కొన్నిసార్లు షూటింగ్ కూడా చేసుకోనివ్వ‌డం లేద‌ట‌. అభిమానులు ఎన్టీఆర్ కాళ్ల‌పై కూడా ప‌డుతు త‌మ అభిమానాన్ని చాటుకొంటున్నారు. షూటింగ్‌ కి ఎంత డిస్ట‌ర్బ్ చేసినా తార‌క్ మాత్రం చెర‌గ‌ని చిరున‌వ్వుతో అంద‌రినీ ప‌ల‌క‌రించి పంపిస్తున్నాడ‌ట‌. ఎన్టీఆర్ కాళ్ల‌పై ప‌డుతున్న అభిమానుల్ని ఈ ఫొటోలో చూడొచ్చు.