Begin typing your search above and press return to search.

నందమూరి వారసుల పంచెకట్టు పండుగ

By:  Tupaki Desk   |   24 Dec 2016 1:20 PM GMT
నందమూరి  వారసుల పంచెకట్టు పండుగ
X
జూనియర్ ఎన్టీఆర్ నిన్న హఠాత్తుగా రాజమండ్రి ఎయిర్ పోర్టులో కనిపించడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. తన భార్యతో పాటు ఎన్టీఆర్ కనిపిచండంతో అభిమానులు బోలెడంత ఖుషీ అయిపోయారు. కేవలం ఎన్టీఆర్ మాత్రమే కాకుండా.. మొత్తం నందమూరి ఫ్యామిలీ అంతా తూర్పు గోదావరి జిల్లాకు తరలి వచ్చింది.

ఇందుకు కారణం నందమూరి నవతరం వారసుల పంచెకట్టు వేడుక ఘనంగా నిర్వహించడమే. హరికృష్ణ పెద్ద కొడుకు స్వర్గీయ జానకి రామ్ కుమారులు ఇద్దరికీ పంచెకట్టు వేడుకను నందమూరి కుటుంబం గ్రాండ్ గా నిర్వహించింది. తూర్పు గోదావరి జిల్లా.. కరప మండలంలోని.. వేళంగి గ్రామంలో జరిగిన ఈ పంచెకట్టు ఫంక్షన్‌లో నందమూరి కుటుంబం అంతా సందడి చేసింది. హరికృష్ణ ఫ్యామిలీ.. జూనియర్ ఎన్టీఆర్ కుటుంబం.. కళ్యాణ్ రామ్ ఫ్యామిలీ.. ఇలా పలువురు నందమూరి కుటుంబ సభ్యులు ఒకే చోట కనిపించారు.

వేడుక ఆ పిల్లలు ఇద్దరిదీ కావడంతో.. వారే ప్రధాన ఆకర్షణ అయినా.. ఈ వేడుక మొత్తంలో ఎన్టీఆర్-కళ్యాణ్ రామ్ లు ఎంతో అన్యోన్యంగా మాట్లాడుకోవడం.. ఎప్పుడు చూసినా పక్కపక్కనే కనిపించడం మాత్రం హైలైట్ గా నిలిచింది. వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని చెప్పకనే చెప్పారు నందమూరి వారసులు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/