Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ నా ఒరిజినల్ కేరక్టర్

By:  Tupaki Desk   |   25 Sept 2017 3:56 PM IST
బిగ్ బాస్ నా ఒరిజినల్ కేరక్టర్
X
టాలీవుడ్ ఫిలిం సత్తాను బాహుబలి ఎలా ప్రూవ్ చేసిందో.. ఒక రియాల్టీ షో పవర్ ఏ రేంజ్ లో ఉంటుందో ఎన్టీఆర్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ నిరూపించింది. ఇప్పుడీ షో పూర్తయిపోయింది. శివబాలాజీ చివరకు విజేతగా నిలిచి 50 లక్షల రూపాయల ప్రైజ్ మనీ గెలుచుకున్నాడు. కార్యక్రమం ముగింపు సందర్భంగా ఎన్టీఆర్ చెప్పిన పలు మాటలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

"సినిమాల్లో నేను వేరే పాత్రలలో నటించాల్సి ఉంటుంది. అంటే వేరే వాళ్లు సృష్టించిన పాత్రలలోకి పరకాయ ప్రవేశం చేసి ప్రవర్తించాలి. కానీ బిగ్ బాస్ లో మాత్రం నేను నిజ జీవితంలో ఎలా ఉంటానో అలానే ఉండే అవకాశం లభించింది. ఇతర పాత్రల మాదిరిగా నటించాల్సిన అవసర ఉండదు. నన్ను నన్నుగా చూపించిన కార్యక్మం ఇది. నన్ను నేను ఓపెన్ చేసుకునే ఛాన్స్ ఈ కార్యక్రమం ఇచ్చింది" అని చెప్పాడు ఎన్టీఆర్. బిగ్ బాస్ కార్యక్రమం ఛాలెంజ్ లతో కూడుకున్నదే అయినా.. ఇందో సంతోషకరమైన అనుభవం అని చెప్పాడు జూనియర్. టీం ఇచ్చిన సపోర్ట్.. నాపై కురిపించిన ప్రేమ అద్భుతం అన్నాడు యంగ్ టైగర్.

ఇప్పుడీ షో పూర్తయిపోవడంతో.. తాను మా టీవీని.. వీకెండ్స్ లో అందరితో ఇంటరాక్ట్ అయ్యే అవకాశాన్ని కోల్పోతున్నానని ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యాడు. ఈ బిగ్గెస్ట్ రియాల్టీ షోకు హోస్ట్ చేయాల్సిందిగా తనను అడిగినప్పుడు.. ఈ ఛాలెంజ్ స్వీకరించడానికి తాను ఎక్కవ సమయం తీసుకోలేదని చెప్పాడు జూనియర్. ఇదే సమయంలో జై లవకుశ చిత్రానికి భారీ కలెక్షన్స్ వస్తుండడాన్ని కూడా తాను ఎంజాయ్ చేస్తున్నట్లు చెప్పాడు జూనియర్.