Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ వారసత్వాన్ని నమ్మడట

By:  Tupaki Desk   |   19 Sept 2017 9:00 PM IST
ఎన్టీఆర్ వారసత్వాన్ని నమ్మడట
X
ప్రస్తుత రోజుల్లో ప్రతి సినిమా ఇండస్ట్రీలో చాలా కుటుంబాలకు సంబందించి వారు వెండి తెరను ఏలుతున్నారు. ప్రతి స్టార్ హీరో తన కుమారులు హీరోలు కావాలని కళలు కంటారు. అయితే ఎంత పెద్ద స్టార్ హీరో కొడుకు అయినా ఒక్కోసారి అనుకున్నంత స్థాయిలో ఎదగలేడు. బ్యాక్ గ్రౌండ్ ఉన్నా ఆది మొదటి సినిమా వరకే పనికొస్తుంది. కష్టపడితే గాని ఎవ్వరు స్టార్ హోదాని అందుకోలేరు అన్న విషయం అందరికి తెలిసిందే.

తెలుగు చిత్ర పరిశ్రమలోని ఇప్పుడున్న స్టార్ హీరోలు ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో వచ్చిన వారే. కానీ ప్రస్తుతం సొంతంగా వారికంటూ ఒక మార్కెట్ ని స్థాయిని పెంచుకొని సేఫ్ జోన్ లో ఉన్నారు. అదే తరహాలో నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో జూనియర్ ఎన్టీఆర్. మొదట తాత ఆశీర్వాదంతో సినిమా పరిశ్రమల్లోకి అడుగుపెట్టిన తారక్ ఆ తర్వాత తనకంటూ.. ఓ గుర్తింపును తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఆ ఫ్యామిలిలో టాప్ మార్కెట్ ఉన్న హీరోగా కొనసాగుతున్నాడు.

అయితే ఈ హీరో వారసత్వ హీరోయిజాన్ని నమ్మను అంటున్నాడు. ఇష్టపడి కష్టపడితేనే దేన్నైనా సాధించగలరని బ్యాక్ గ్రౌండ్ ఉంటే సరిపోదు అంటున్నారు. వారసత్వంగా దేన్నయినా కొనసాగించడం కరెక్ట్‌ కాదని తారక్ అభిప్రాయపడుతున్నాడు. అలాగే నేను హీరోను కాబట్టి మా అబ్బాయి అభయ్‌ కూడా హీరో అవ్వాలంటే కుదరదు అని చెబుతూన్నాడు. కానీ అభిమానులు మాత్రం ఎన్టీఆర్ కుమారుడితో సినిమాలో కనిపిస్తే చాలా బావుంటుందని కామెంట్ చేస్తున్నారు.