Begin typing your search above and press return to search.

సల్మాన్ ఎఫెక్టుతో.. ఎన్టీఆర్ దమ్ము

By:  Tupaki Desk   |   17 May 2016 1:30 PM GMT
సల్మాన్ ఎఫెక్టుతో.. ఎన్టీఆర్ దమ్ము
X
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన దమ్ము చూపించాలంటే బాలీవుడ్ సూపర్ స్టార్ ని అప్పు తెచ్చుకోవాల్సిన పనిలేదు. బోలెడంత మంది అభిమానులు వెనక ఉన్నారు. పైగా తనే దమ్ము అనే టైటిల్ సినిమా చేసి దమ్ము చూపిద్దామని అనుకున్నాడు కానీ.. అంతగా వర్కవుట్ కాలేదు. కానీ ఈ దమ్ము చిత్రం.. హిందీ వెర్షన్ మాత్రం సూపర్ గా ఆడేస్తోంది.

ఒరిజినల్ సినిమానే ఫ్లాప్ అయితే.. దాన్ని డబ్ చేయడం ఏంటి? అది సూపర్ గా ఆడేయడం ఏంటి? అనుకోవచ్చు కానీ.. ఇది వాస్తవమే. ఎన్టీఆర్-బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన దమ్మును.. హిందీలో సుల్తాన్ పేరుతో డబ్ చేశారు. థియేటర్లలో రిలీజ్ లాంటి హంగామా చేయకపోయినా.. యూట్యూబ్ లో పెట్టేశారు ఈ సుల్తాన్ ని. దీనికి ఇప్పటికి 87కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. అది కూడా కేవలం నెలన్నర రోజుల్లోనే. త్వరలోనే కోటి వ్యూస్ కూడా దాటిపోయే ఛాన్సులున్నాయి. హిందీ జనాలకు ఎన్టీఆర్ సుల్తాన్ తెగ నచ్చేయడంతో సినిమా ఆడేసిందని అనుకోవడం అత్యాశే అని చెప్పాలి.

అసలు ఈ చిత్రం ఇంతగా వ్యూస్ దక్కించుకోవడానికి కారణం సుల్తాన్ టైటిల్. సల్మాన్ ఖాన్ నటించిన సుల్తాన్ త్వరలో విడుదల కాబోతోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో ఇదే మోస్ట్ అవైటింగ్ మూవీ. ఈ టైటిల్ తో యూట్యూబ్ లో సినిమాని విడుదల చేయడంతో.. సుల్తాన్ అని సెర్చ్ చేసిన వెంటనే ఈ వీడియో వచ్చేస్తోంది. స్టార్టింగ్ లో కంటెంట్ కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో.. వ్యూస్ కూడా బాగానే దక్కుతున్నాయి. అలా సల్మాన్ ని వాడేసుకుని ఎన్టీఆర్ తన దమ్ము చూపించేస్తున్నాడు.