Begin typing your search above and press return to search.

అన్నయ్య కోసం రంగంలోకి దిగిన జూనియర్

By:  Tupaki Desk   |   20 Nov 2018 12:03 PM IST
అన్నయ్య కోసం రంగంలోకి దిగిన జూనియర్
X
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్లో అప్స్ డౌన్స్ రెండూ చూసినవాడే. ఇప్పుడు మళ్ళీ వరస హిట్స్ తో జోరుమీద ఉన్నాడు. కానీ ఎన్టీఆర్ అన్నయ్య కళ్యాణ్ రామ్ పరిస్థితి నానాటికి తీసికట్టుగా ఉంది. అడపాదడపా ఏదో ఒక హిట్టు తగిలినా హీరోగా ఇంతవరకూ ఒక స్టేబుల్ మార్కెట్ ఎర్పరుచుకోలేకపోయాడు. ఈమధ్య వరస ఫ్లాపులతో డీలా పడ్డాడు. దీంతో అన్నయ్య కోసం ఎన్టీఆర్ రంగంలో దిగాడని సమాచారం.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ వారితో మాట్లాడి అన్నయ్య కళ్యాణ్ రామ్ తో ఒక సినిమాను ప్లాన్ చేయాల్సిందిగా కోరాడట. మైత్రీ వారు ఇప్పటికే ఎన్టీఆర్ తో 'జనతా గ్యారేజ్' లాంటి బ్లాక్ బస్టర్ నిర్మించిన విషయం తెలిసిందే. ఈ పరిచయంతోనే వారు కూడా సరే అన్నారట. ఇప్పటికే ఈ దిశగా సన్నాహాలు చేస్తున్నారట. ఈ సినిమాకు ఒక నూతన దర్శకుడిని ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారట. డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయని సమాచారం.

ఈసారి కళ్యాణ్ రామ్ కు హీరోగా హిట్ వచ్చేందుకు ఎన్టీఆర్ తనవైపు నుండి సహకారం అందిస్తున్నాడు కాబట్టి అన్నయ్య కోసం మంచి సబ్జెక్టు ఎంపిక చేసే అవకాశం ఉంది. ఈ సినిమాతో అయినా కళ్యాణ్ రామ్ మంచి విజయం సాధించాలని కెరీర్ లో బ్రేక్ రావాలని కోరుకుందాం.