Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ నెక్స్ట్ అతడితోనే

By:  Tupaki Desk   |   21 Sept 2017 5:09 PM IST
ఎన్టీఆర్ నెక్స్ట్ అతడితోనే
X
స్టార్ ఇమేజ్ ని బట్టి కొందరు హీరోలు సినిమాలనుఈ చేస్తే.. మరికొందరు ప్రయోగాత్మకమైన సినిమాలే అసలైన సినిమాలు అనేలా చేస్తుంటారు. అన్ని కథలు అందరి హీరోలకు సెట్ అవ్వవు కొన్ని కథలు ప్రత్యేకంగా హీరోల కోసమే పుడతాయని చెప్పాలి. దర్శకులు కూడా ఒక్కోసారి కాన్సెప్ట్ ని అనుకోని హీరోను గుర్తు చేసుకొని ఆ తరహాలో కథను అల్లుతారు. ప్రస్తుతం ఎన్టీఆర్ కోసం అలాంటి కథలే ఎక్కువగా వస్తున్నాయని తెలుస్తోంది.

నటనాపరంగా ఎక్కువ స్కోప్ ఉన్న సినిమాలకు తారక్ లాంటి వారే అసలైన కథానాయకులని దర్శకులు మరో హీరోలవైపు చూడటం లేదు. ఇప్పటికే జై లవకుశ ని థియేటర్స్ లోకి వదిలిన ఎన్టీఆర్ విజయంవైపు దూసుకువెళుతున్నాడు. అయితే తారక్ నెక్స్ట్ ఎలాంటి సినిమా చేయబోతున్నాడని అందరిలో ఆసక్తిని రేపింది. గత కొంత కాలంగా ఈ హీరో పలు దర్శకులతో కథలను ఒకే చేశాడని రూమర్స్ వస్తున్నాయి. ముఖ్యంగా రాజమౌళి మరియు కొరటాల శివ వంటి వారు చెప్పిన కథలకు తారక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.

అయితే తారక్ త్రివిక్రమ్ తో తప్పా ఇంకా ఏ కథలను ఒకే చెయ్యలేదని చెప్పాడు. అయితే ప్రస్తుతం త్రివిక్రమ్ - పవన్ 25వ చిత్రంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ సినిమా అయిపోవడానికి ఇంకా మూడు నెలలు సమయం పట్టవచ్చని తెలుస్తోంది. దీంతో ఎన్టీఆర్ అప్పటివరకు కాలిగానే ఉంటాడట. కాకపోతే ఇన్ని రోజులు బిగ్ బాస్ - జై లవకుశ షూటింగ్స్ లో బిజీ బిజీగా గడిపినందుకు ఒక నెల పాటు ఫ్యామిలీతో విదేశాలకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. ఆ విహార యాత్రల తర్వాత తిరిగి వచ్చాక కేవలం త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ని మాత్రమే మాత్రమే ముందు మొదలు పెడతాడట తారక్.