Begin typing your search above and press return to search.

బృందావనానికి ఐదేళ్ల మధుర స్మృతులు

By:  Tupaki Desk   |   14 Oct 2015 5:30 PM GMT
బృందావనానికి ఐదేళ్ల మధుర స్మృతులు
X
బృందావనం.. ఇప్పుడు ట్విట్టర్ లో ట్రెండ్ సృష్టిస్తున్న హ్యాష్ ట్యాగ్ ఇది. మూవీ రిలీజైన ఐదేళ్ల తర్వాత కూడా ట్రెండ్ సృష్టిస్తోందంటే.. బృందావనంకు ఉన్న క్రేజ్ అర్ధమవుతుంది. ఎన్టీఆర్ ను కొత్తగా చూపించడంలో డైరెక్టర్ వంశీ పైడిపల్లి సూపర్ సక్సెస్ అయ్యాడు. యాంగ్రీ యంగ్ మెన్ కేరక్టర్లకే పరిమితమయ్యి.. మూసలో కొట్టుకుపోతున్న ఎన్టీఆర్ ఇమేజ్ ని.. లవర్ బోయ్ గా మార్చేశాడు వంశీ.

అన్నిటి కంటే ముఖ్యంగా.. డైలాగ్స్ విషయంలో ఎన్టీఆర్ ఓ ట్రెండ్ సృష్టించేశాడు బృందావనంతో. 'కేరక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశా.. లోపల ఒరిజినల్ అలాగే ఉంది' అంటూ యంగ్ టైగర్ చెప్పిన డైలాగ్ ఎవర్ గ్రీన్. జనాల నోళ్లలో ఇప్పటికీ ఈ డైలాగ్ నానుతూనే ఉంటుంది. అలాగే ఈ మూవీతో ఎన్టీఆర్ ఓ అరుదైన రికార్డ్ సృష్టించాడు. వరుసగా 5 సినిమాలు ఫిఫ్టీడేస్ కంప్లీట్ చేసుకోవడం ఇండస్ట్రీ రికార్డ్. పాటల విషయంలో అయితే... ప్రతీ పాటా సూపర్ హిట్టే. ఫైట్లలో ఒక్కోటీ ఒక్కో వెరైటీ. బ్రహ్మీ కాంబినేషన్ లో ఎన్టీఆర్ చేసిన సీన్స్ సినిమాకే హైలైట్. కొన్ని పత్రికల్లో ఇఫ్పటికీ బృందావనం పోస్టర్స్ మెయిన్ పేజ్ పై ఉంటున్నాయంటే.. ఆ మూవీ కెపాసిటీ అర్ధమవుతుంది.

కలెక్షన్లలోనూ కొత్త రికార్డులు సృష్టించింది. ఫ్యాన్స్ నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ వరకూ అందరినీ అలరించింది బృందావనం. ఇలా చెప్పుకుంటూ పోతే బృందావనం రికార్డులు, రివార్డులు చాలానే ఉంటాయి. అందుకే ఎన్టీఆర్ కెరీర్ కాదు.. టాలీవుడ్ హిస్టరీలోనే బృందావనం ఎవర్ గ్రీన్ మూవీ అని చెప్పాలి.