Begin typing your search above and press return to search.

నిమ్మ‌కూరులో బాల‌య్య ఆప‌రేష‌న్‌?

By:  Tupaki Desk   |   4 Aug 2018 5:26 AM GMT
నిమ్మ‌కూరులో బాల‌య్య ఆప‌రేష‌న్‌?
X
న‌ట‌సింహా నందమూరి బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా `ఎన్టీఆర్‌` ఆన్‌ సెట్స్ ఉన్న సంగ‌తి తెలిసిందే. న‌వ‌ర‌స న‌ట‌సార్వ‌భౌముడు .. అన్న‌గారు ఎన్టీఆర్ జీవిత‌క‌థ‌లో కీల‌క ఘ‌ట్టాల్ని ఈ సినిమాలో చూపించ‌బోతున్నారు. ఎన్టీఆర్ సినీజీవితం - బాల్యం - వ్య‌క్తిగ‌త జీవితం ఇలా అన్ని కోణాల్ని స్పృషిస్తూ ఈ సినిమాని తెర‌కెక్కిస్తున్నారు. క్రిష్ శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ పూర్తి చేసే ప‌నిలో ఉన్నారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ వ్య‌క్తిగ‌త జీవితానికి సంబంధించిన కీల‌క స‌న్నివేశాల్ని నిమ్మ‌కూరు ప‌రిస‌రాల్లో తెర‌కెక్కించ‌నున్నార‌ని తెలుస్తోంది.

ఆ ప‌నిలో భాగంగానే ప్ర‌స్తుతం బాల‌య్య‌బాబు - క్రిష్ నిమ్మ‌కూరు ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. నేడు 10 గంట‌ల నుంచి స్వ‌ర్గీయ ఎన్టీఆర్ సొంత ఊళ్లోనే తిష్ఠ అక్క‌డ ప్ర‌జ‌ల‌తో - నంద‌మూరి అభిమానుల‌తో - స్థానిక మీడియాతోనూ ముచ్చ‌టిస్తున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ స‌మ‌కాలికులైన‌ ఫ్యాన్స్‌ తో చ‌ర్చ‌లు సాగిస్తున్నార‌ట‌. ఇక ఎన్టీఆర్ న‌డ‌యాడిన కొమ‌ర‌వోలులోనూ నేటి మ‌ధ్యాహ్నం ప‌ర్య‌ట‌న కొన‌సాగిస్తున్నారు. అయితే దీని ఉద్ధేశం ఫ్యాన్స్‌ ని క‌ల‌వ‌డ‌మేనా? లొకేష‌న్లు వెతుకుతున్నారా? .. మ‌రికాస్త డీప్‌ గా ఇన్‌ ఫ‌ర్మేష‌న్ గేద‌ర్ చేస్తున్నారా? అన్న‌ది తెలియాల్సి ఉంది. ఇక నిమ్మ‌కూరు - కొమ‌ర‌వోలుకు స్థానిక మీడియాని ఆహ్వానించ‌డంతో మ‌రింత ఆస‌క్తి రెయిజ్ అయ్యింది.

ఈ సినిమాలో విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్‌ రాజ్ హెచ్ ఎం రెడ్డి పాత్ర‌లో న‌టిస్తున్నారు. విద్యాబాల‌న్ బ‌స‌వ‌తార‌కం పాత్ర‌లో అద్భుత‌మైన అభిన‌యం క‌న‌బ‌రుస్తున్నార‌ని ఆన్ లొకేష‌న్ నుంచి రిపోర్ట్ అందింది. ర‌కుల్ ప్రీత్ ఎన్టీఆర్ నాయిక‌ల్లో ఒక పాత్ర‌లో అభిన‌యించ‌నున్నార‌ట‌. నిమ్మ‌కూరు బోయ్‌ గా మోక్ష‌జ్ఞ అభిన‌యించ‌నున్నార‌న్న వార్త‌లొచ్చాయి. చంద్ర‌బాబు నాయుడు పాత్ర‌లో రానా న‌టిస్తున్నారు. ఎన్టీఆర్ జీవితంలో అత్యంత కీల‌క‌మైన పాత్ర నాదెండ్ల పాత్ర‌పైనా జోరుగా ఊహాగానాలు సాగుతున్న సంగ‌తి తెలిసిందే.