Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ వేదిక మారుతోందా ?

By:  Tupaki Desk   |   16 Dec 2018 9:27 AM
ఎన్టీఆర్ వేదిక మారుతోందా ?
X
ఔననే అంటున్నాయి నందమూరి సన్నిహిత వర్గాలు. ఈ నెల 21న స్వర్గీయ ఎన్టీఆర్ స్వంత ఊరు నిమ్మకూరులో తలపెట్టిన ఆడియో ఫంక్షన్ వేదికను మార్చినట్టు సమాచారం అందుతోంది . ఖచ్చితమైన కారణం తెలియదు కాని జ్యోతిష్యుల సలహా మేరకే బాలయ్య స్వయంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెబుతున్నారు. పైగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అభిమానులు తరలి రావాలి కాబట్టి నిమ్మకూరు అయితే రవాణా పరంగా ఇబ్బందులు తలెత్తవచ్చనే కోణంలో కూడా చర్చలు జరిగాయట.

నిన్న కొత్తగా వదిలిన పోస్టర్స్ లో వేదిక పేరు లేదు. ట్రైలర్ 16న వస్తుంది అన్నారు కాని అదీ వాయిదా వేసి ఫంక్షన్ లోనే రిలీజ్ చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇదంతా పండితుల సలహా మేరకే జరిగిందా లేక ఇతరత్రా కారణాలు ఉన్నాయా అనే దాని మీద క్లారిటీ లేదు. సో వేదిక హైదరాబాద్ లోనే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తొలుత అమరావతి అనుకున్నా విజయోత్సవ వేడుక అక్కడ ప్లాన్ చేసి ఆడియో వరకు భాగ్యనగరంలోనే చేయాలని నిర్ణయం తీసుకున్నారట.

మొత్తానికి ఎన్టీఆర్ విషయంలో అనూహ్య నిర్ణయాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రాజెక్ట్ ఓకే అయినప్పుడు దర్శకుడు తేజతో మొదలుపెట్టారు. ఆ తర్వాత క్రిష్ సీన్ లోకి వచ్చాడు. ఇప్పుడు వేదికల మార్పు. క్యామియోల కోసం ఆర్టిస్టులు కూడా మారారు. అనుకున్నది ఒకరు చేసింది మరొకరు. మొత్తానికి ఎన్టీఆర్ వేదిక మారడం పట్ల అభిమానులు హ్యాపీగానే ఉన్నారు. హైదరాబాద్ అయితే రాకపోకలు సులభంగా ఉంటాయి.