Begin typing your search above and press return to search.

ఫస్ట్ లుక్: ఎన్.టి.ఆర్

By:  Tupaki Desk   |   17 Jan 2018 10:21 PM IST
ఫస్ట్ లుక్: ఎన్.టి.ఆర్
X
'ప్రజలే దేవుళ్ళు.. సమాజమే దేవాలయంగా జీవించిన ఓ మహానుభావునికి ఇదే మా నివాళి' అంటూ ఒక పోస్టర్ రిలీజ్ చేయడంతో సడన్ గా అందరూ స్టన్నయ్యారు. అవును.. ఎప్పటినుండో కేవలం మాటలకే పరిమితమైన లెజండరీ నటుడు మరియు రాజకీయ నాయకుడు నందమూరి తారకరామారావు జీవితచరిత్రను సినిమాగా మలుస్తున్నట్లు.. ఈ మధ్యనే ప్రకటనలు విడుదలయ్యాయ్. అదిగో ఇప్పుడు ఫస్ట్ లుక్ కూడా వచ్చింది.

జనవరి 18 అంటే ఎన్టీఆర్ వర్ధంతి అని అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా నిజానికి ఒక టీజర్ రిలీజవ్వాలి. అయితే నందమూరి బాలకృష్ణ తన తండ్రి పాత్రలో నటిస్తున్న ఈ బయోపిక్ తాలూకు టీజర్ ను రిలీజ్ చేయట్లేదని మొన్ననే స్వయంగా బాలయ్యే చెప్పారు. ఇకపోతే ఈ సందర్భంగా సినిమా తాలూకు ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ముఖ్యంగా అందులో ఎన్టీఆర్ సంతకానికి దగ్గరగా ఉండేలా ఎన్.టి.ఆర్ అనే అక్షరాలను రూపొందించడం.. అలాగే వెనుక ఇంగ్లీషులో కూడా అదే అక్షరాలు పెట్టడం.. చాలా బాగుందే చెప్పాలి.

విలక్షణ దర్శకుడు తేజ రూపొందిస్తున్న ఈ సినిమాకు.. నందమూరి బాలకృష్ణ.. సాయికొర్రపాటి మరియు విష్ణువర్దన్ ఇందూరి ప్రొడ్యూసర్లు కాగా.. ఈ సినిమాకు ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు.